టీమిండియా అవ‌న‌స‌రంగా శ్రీల‌కంకు వెళ్లిందంటున్న మాజీ క్రికెట‌ర్‌...!

భారత క్రికెట్ జట్టు ప్రథమ శ్రేణి జట్టు ఇంగ్లండ్ పర్యటనకని వెళ్తే వారిని తిరిగి శ్రీలంకకు పర్యటనకు పంపించడం అసాధ్యం కనుక బాగా ఆలోచించి బీసీసీఐ పెద్దలు ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పర్యటనకు పంపారు.చాలా రోజుల క్వారంటైన్ తర్వాత బయోబబుల్ లో వన్డే సిరీస్ ఆరంభమయింది.

 Ind Vs Sl India Tour Former Indian Cricketer Yujivindra Singh-TeluguStop.com

కాగా.ఇండియా జట్టు అలవోకగా వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచులను నెగ్గింది.

కానీ తర్వాత కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం టీంలో సమూల మార్పులు చేసింది.దాదాపు ఏడెనిమిది మంది ప్లేయర్లు కొత్తవారు కావడంతో వారు సరిగ్గా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

 Ind Vs Sl India Tour Former Indian Cricketer Yujivindra Singh-టీమిండియా అవ‌న‌స‌రంగా శ్రీల‌కంకు వెళ్లిందంటున్న మాజీ క్రికెట‌ర్‌…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందువల్ల చివరిదైన మూడో వన్డేలో మన భారత జట్టు ఆతిథ్య శ్రీలంక మీద చివరి వరకూ పోరాడి ఓడిపోయింది.ముందు రెండు మ్యాచులు గెలిచి ఉన్నాం కాబట్టి… మూడో మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.

ఆ విధంగా ఇండియా జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.అనంతరం జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన మొదటి మ్యాచులోనే టీం ఇండియా అతిథ్య శ్రీలంకను మట్టి కరిపించి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.

కానీ తర్వాత టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా కరోనా భారిన పడడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన దాదపు ఎనిమిది మంది టీం సభ్యులు లేకుండానే కొత్త వారితో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది.అనంతరం జరిగిన మూడో టీ20 లో కూడా ఓటమిని మూటగట్టుకుని సిరీస్ చేజార్చుకుంది.

కాగా శ్రీలంక పర్యటనకు టీమిండియాను పంపి ప్రయోజనం ఏం లేదని మాజీ క్రికెటర్‌ యజువీంద్ర సింగ్‌ అభిప్రాయడ్డాడు.డబ్బులకు ఇబ్బందులు పడుతున్న ఆ దేశ బోర్డును ఆదుకునేందుకే బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టుని అక్కడకు పంపిందని అన్నాడు.

#Team India #Sri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు