టిఆర్ఎస్ ఓడిన హరీష్ కు పెరిగిన క్రేజ్ ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందుతుంది అని టిఆర్ఎస్ నేతలు ఎవరూ ఊహించలేకపోయారు.ఈ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

 Increased Sympathy For Harish Despite Trs Party Defeat In Dubaka By-election, Bj-TeluguStop.com

తెలంగాణలో చాలాకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతూ వస్తుందనే విషయం ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు.అయితే ఇది సర్వసాధారణం అని, అయినా తమకు పోటీ ఇచ్చే స్థాయిలో అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ లేవని, ఆ పార్టీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చింది.

అందుకే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చింది.కానీ అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందింది.

దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో కలకలం మొదలైంది.కేవలం దుబ్బాక ఎన్నికలలో ఇది ఆగేది కాదని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాని ప్రభావం తప్పక కనబడతుందని , అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ, దీని ప్రభావం ఖచ్చితంగా ముందు ముందు ఉంటుందని, అది కాకుండా ఇక పార్టీ నుంచి వలసలు పెరిగి బిజెపి మరింత బలపడుతుందని టిఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.

అయితే దుబ్బాకలో ఓటమి మొత్తం హరీష్ రావు పై వేయడం, ఆయనని టార్గెట్ చేసుకుంటూ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్న వంటి వ్యవహారాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవంగా దుబ్బాక ఎన్నికల ప్రచారం మొత్తం హరీష్ రావు తీసుకున్నారు.

ఇక్కడ అన్నీ తానే ముందుండి నడిపించారు.కేటీఆర్ , కెసిఆర్ వంటి వారు ఇక్కడ ప్రచారానికి దూరంగా ఉన్న హరీష్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి ఈ నియోజకవర్గంలో తిరుగుతూ, టీఆర్ఎస్ ను బలోపేతం చేసే విషయం పైనే దృష్టి సారించారు.

కానీ ఆయన కష్టమంతా వృధా అయింది.దీనికి ఆయన తప్పిదం ఏమీ లేదని, ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి బలంగా లేకపోవడం, ఆ పార్టీలో బలమైన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడం, ఆయనే ఆ పార్టీ అభ్యర్ధి కావడం, టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత కుటుంబానికి స్థానికంగా కాస్త వ్యతిరేకత ఉండడం వల్ల ఎన్నో కారణాలు టిఆర్ఎస్ ఓటమిలో భాగమయ్యాయి.

టిఆర్ఎస్ లోని ఒక వర్గం నేతలు మాత్రం ఈ ఓటమికి హరీష్ రావు బాధ్యత వహించాలి అన్నట్లుగా ఆ భారీ మొత్తం హరీష్ రావు ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు జనాల్లో నే కాకుండా, టిఆర్ఎస్ లోనూ హరీష్ పైన సానుభూతి పెరిగిపోతోంది.

అసలు టిఆర్ఎస్ అభ్యర్థి ఆయన అనే విషయం కెసిఆర్, కేటీఆర్ వంటి వారికి ముందే తెలుసునని , అందుకే వారు ప్రచారానికి దూరంగా ఉండి హరీష్ ను బలిపశువు చేసేందుకు ముందుగానే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారని, ఆ సాకుతో ఆయనకు ఇకపై టిఆర్ఎస్ లో ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు అని ఇలా ఎన్నో విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.మొత్తం ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందినా, హరీష్ వైపు సానుభూతి పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube