కులమే బలం ! హుజురాబాద్ లో వీరి ప్రభావం ఎంతంటే ? 

కులాల వారిగా, మతాల వారీగా ప్రాధాన్యాలు కల్పించి, రెచ్చగొట్టి , బుజ్జగించి, తాయిలాలు ప్రకటించి వారి మద్దతు కూడగట్టి ఎన్నికల్లో విజయం సాధించేలా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఎన్నికల సమయంలో కులాలకు,  కుల సంఘాల నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తూ ఉంటాయి.

 Increased Preference For Caste Leaders In Hujurabad Constituency-TeluguStop.com

ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా,  కులసంఘాలదే కీలకపాత్ర.ఆ ప్రాంతంలో ఏ కులం ఓటర్లు ఎక్కువ మంది ఉంటే ఆ కులానికి,  ఆ కులం సంఘం నాయకులకు ప్రాధాన్యం ఏర్పడుతూ ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోతున్న ఉప ఎన్నికలలోనూ వీరిదే హడావుడి.అన్ని రాజకీయ పార్టీలు అయా కులలాలను ఆకట్టుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూనే  ఉన్నాయి.

 Increased Preference For Caste Leaders In Hujurabad Constituency-కులమే బలం హుజురాబాద్ లో వీరి ప్రభావం ఎంతంటే  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
  మొత్తం 45 వేల మంది ఓటర్లు ఉండగా, వీరందర్నీ ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది.

ఇక మిగతా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తూ,  వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు 22,600 , మున్నూరు కాపు ఓటర్లు 29,100, గౌడ 24,200, పద్మశాలి 26,350, ముదిరాజ్  23,220, యాదవ 22,150, మాదిగ సామాజిక వర్గం 35,600, మాల 11, 100 , షెడ్యూల్ తెగలు 4, 220, నాయీ బ్రాహ్మణ 3,300, మైనార్టీలు 5,100 మంది ఉన్నారు.

దీంతో కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక వర్గాలకు తాము ఎంత గా ప్రాధాన్యం కనిపించబోతున్నాము అనే విషయాన్ని అన్ని పార్టీలు చెబుతూ,  వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
   

Telugu Balmuri Venkat, Bjp, Congress, Etela Rajendar, Gellu Srinivas Yadav, Huzurabad Elections, Revanth Reddy, Trs-Telugu Political News

 ముఖ్యంగా ఈ విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడుగా ఉన్నట్టు కనిపిస్తోంది.ఇక బిజేపి అభ్యర్థి రాజేందర్ ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండటం తో అన్ని కుల సంఘాలను మచ్చిక చేసుకుని వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం అయ్యాయి.

#Huzurabad #Congress #Etela Rajendar #Balmuri Venkat #GelluSrinivas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు