అక్కడ ఎన్నికల ఎఫెక్ట్ ! కుల సంఘాలదే హవా ?

ఎక్కడైనా ఎన్నికల తంతు మొదలవబోతుంది అంటే చాలు చిన్న , చితకా నాయకులకు ప్రాధాన్యం పెరిగిపోతోంది.తమ డిమాండ్లను పార్టీల అధిష్టానం ముందు ఉంచుతూ తమ పరపతిని పెంచుకోవడంతో పాటు , భారీగా లబ్ధి పొందేందుకు నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు.

 Increased Preference For Caste Groups In The Wake Of Huzurabad  Lections Hujurab-TeluguStop.com

అలాగే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు ఇదే విధంగా ఉంటాయి.వీటితో పాటు కుల సంఘాల ప్రాధాన్యము ఎక్కువగా ఉంటుంది.

ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ఆయా సామాజిక వర్గం వారే కావడం,  కులాల ఆధారంగానే ఓట్లు రాలే పరిస్థితి ఇల్లా చాలా కాలం నుంచి ఉండడం , ఇలా రకరకాల కారణాలతో కుల సంఘాల కు ఎక్కువగా ఎన్నికల సమయంలో ప్రాధాన్యం పెరుగుతోంది .ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్  ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతూ ఉండడం తో కుల సంఘాలకు ప్రాధాన్యం పెరిగింది.అన్ని పార్టీలు ఆయా సంఘాలను మచ్చిక చేసుకుని, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

        ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కులాల ఆధారంగా వివిధ పథకాలను ప్రవేశపెడుతూ, అయా సామాజిక వర్గాలు పూర్తిగా తమ వైపు ఉండేలా చూసుకుంటోంది.

దీనికి విరుగుడుగా కాంగ్రెస్ బీజేపీలు కుల సంఘాల లో పట్టుసాధించేందుకు,  ఆ సామాజిక వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో,  కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా అంటూ గిరిజనుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది.

ఇక అన్ని కులాలకు ఇదేవిధంగా దళిత బందు తరహా లు పథకాలను ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ ,బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి.ముఖ్యంగా దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లో అమలు చేయడంతో మిగిలిన కులాల్లో టిఆర్ఎస్ పై అసంతృప్తి పెరిగిందనే సంకేతాలతో ఆ పార్టీ అప్రమత్తమైంది.

కుల సంఘాల ద్వారా ఆయా సామాజిక వర్గం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
     

Telugu Bandi Sanjay, Dalitha Bandu, Hujurabad, Revanth Reddy, Telangana-Telugu P

   దీనికోసం కులాల వారీగా అనేక పథకాలను ప్రవేశపెడుతూ, ఆకట్టుకునే ప్రయత్నం టిఆర్ఎస్ చేస్తోంది.హుజూరాబాద్ నియోజకవర్గం లో 2 లక్షల, 26 వేల మంది ఓటర్లు ఉన్నారు.వీరిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు 45 వేల మంది ఉన్నారు.21,000 దళిత కుటుంబాలలో సగం మందికి ఈ దళిత బంధు పథకం అందుతోంది.వీరు ఖాతాలో సొమ్ము పడ్డాయి యాదవ సామాజిక వర్గం వారు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో, ఆ సామాజిక వర్గం వారికి గొర్రెల పంపిణీ, యాదవ భవనాలు కట్టేందుకు స్థలం, నిధులు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇస్తోంది.

ఇక పద్మశాలి , నాయి బ్రాహ్మణ , రెడ్డి, కాపు, వైశ్య ,గౌడ సామాజిక వర్గాల కు చెందిన ప్రతినిధులతో నిత్యం టీఆర్ఎస్ మంత్రులు సమావేశాలు నిర్వహిస్తూ, వారంతా తమ వైపు ఉండేలా చూసుకుంటున్నారు.ముఖ్యంగా ఈటెల రాజేందర్ సామాజిక వర్గమైన ముదిరాజ్ కులం పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ విధంగా కులాల వారీగా, టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ లు ప్రయత్నిస్తుండటంతో, ఆయా కుల సంఘాల నాయకులకు ఎక్కడ లేని ప్రాధాన్యం పెరిగి పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube