ఎమ్మెల్సీ సీట్ల కోసం పెరిగిన పోటీ.. ఆ 17 మంది‌లో ఛాన్స్ ఎవరికి?

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం నేతల మధ్య పోటీ తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనే విషయమై కూడా పోటీ ఉండగా, అక్కడ బరిలో దిగేవారికి స్థానికత అంశం కీలకం.

 Increased Competition For Mlc Seats Who Among Those 17 Has A Chance, Mlc Quota,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆ స్థానానికి పోటీ ఉన్నా కలిసి కట్టుగా పని చేసే అవకాశాలున్నాయి.కానీ, శాసనసభ్యుల నుంచి మండలికి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నేతల్లో పోటీ నెలకొని ఉంది.

అయితే, ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ ఇస్తానని పలు సందర్భాల్లో టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీలు ఇచ్చి ఉన్నారు.ఈ క్రమంలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు? అనే విషయమై సందిగ్ధం ఉంది.కొత్త వారికి ప్రాతినిథ్యం కల్పించేందుకు సీఎం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.కాగా, అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేరిన వారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలున్నాయి.తాజాగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయడం ద్వారా సీఎం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? అనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లోనూ మొదలైంది.అయితే, ఎమ్మెల్సీ సీట్ల కోసం చాలా మంది ఎదురు చూస్తుండగా, 17 మంది నేతలైతే చాలా సీరియస్‌గా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఇంకా ఆరు స్థానాలు ఖాళీగానే ఉండబోతున్నాయి.

Telugu Huzurabad, Karnatividya, Ramana, Mlc Quota, Peddi, Teegalakrishna, Ts-Tel

ఈ క్రమంలోనే గులాబీ గూటిలోని పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు.హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, చకిలం అనిల్ కుమార్, పిట్టల రవీందర్, టి.సంతోశ్ కుమార్, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్.రమణ, ఆకుల లలిత, సీవీరావు, జూపల్లి కృష్ణారావు, జనార్ధన్ ఇంకా పలువురు నేతలు ఎమ్మెల్సీని ఆశిస్తున్నారు.అయితే, వీరిలో చాలా మంది అధిష్టానం ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది.

ఎమ్మెల్సీ పదవి పొందాక కేబినెట్‌లోనూ చోటు దక్కించుకుని మంత్రి పదవి ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.అయితే, సామాజిక వర్గాల సమీకరణ, రాజకీయ లబ్ధి ఇతర విషయాలను దృష్టి పెట్టుకుని గులాబీ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీల ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube