పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!

Increase The Immunity Power In The Children By Following These Tips

పెద్దల కన్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.వారు నిత్యం దుమ్ము, ధూళి లో ఆడుతుంటారు.

 Increase The Immunity Power In The Children By Following These Tips-TeluguStop.com

మరోవైపు శుభ్రత చాలా తక్కువగా పాటిస్తారు.స్కూల్ లోనూ ఇతర పిల్లలతో కలిసి తిరుగుతారు కనుక వారికి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వారిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి దీంతో ఇన్ఫెక్షన్ నుండిడి కూడా తప్పించుకోవచ్చు.పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి.

 Increase The Immunity Power In The Children By Following These Tips-పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రొటీన్లు విటమిన్లు మినరల్స్ ఆన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సమతూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి.దీంతో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

అలాగే నిత్యం నిమ్మజాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకుపచ్చని కూరగాయలు, బీన్స్, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి , అల్లం తినిపించాలి.దీని వల్ల వ్యాధుల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

నిద్ర :

పిల్లలు అన్నాక నిద్రపోకుండా మారం చేయడం సహజమే.కొందరు పిల్లలైతే అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు.

తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను త్వరగా పడుకోబెట్టాలి.నిద్ర సరిగ్గా రాకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి.

వారిని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్ కు వీలైనంత దూరంగా ఉంచాలి.నిద్ర తగినంత ఉంటే పిల్లల్లో శరీర రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

Telugu Ayurvedam, Tips, Cleanliness, Tips, Sleep, Immunity, Immunity-Telugu Health

శుభ్రత :

 ఆహారం తినే ముందు, తిన్నాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని పిల్లలకు చెప్పాలి.తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయించాలి.ఆటలు ఆడుకున్నాక కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ముట్టుకుంటే చేతులను శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి.ఎందుకంటే పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గడపడం వల్ల, పెంపుడు జంతువులను ముట్టుకోవడం వల్లే వస్తాయి.

కనుక ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.

Telugu Ayurvedam, Tips, Cleanliness, Tips, Sleep, Immunity, Immunity-Telugu Health

ఆయుర్వేదం: 

పిల్లలకు గుడుచి, అమెరికాకి( ఉసిరి) యష్టిమధు గుగ్గుళ్లు తదితర ఆయుర్వేద మూలికలు నిత్యం ఇవ్వాలి.డాక్టర్ సూచనల మేరకు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వ్యాధులు రాకుండా ఉంటాయి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

#Immunity #Ayurvedam #Tips #Immunity #Sleep

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube