భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త పెరగాలా.? అయితే ఈ 5 వాస్తు టిప్స్ పాటించండి..!  

Increase Interaction Between Husband And Wife With These Tips-

దంప‌తులెవరైనా క‌ల‌కాలం క‌ల‌సి మెల‌సి కాపురం చేయాల‌ని, ఎలాంటి క‌ల‌హాలు రాకుండా సంసార జీవితం స‌జావుగా సాగాల‌నే కోరుకుంటారు.కానీ ఎవ‌రూ విడిపోవాల‌ని అనుకోరు.అయితే నేటి త‌రుణంలో చాలా మంది క‌పుల్స్ మాత్రం అనేక కార‌ణాల వ‌ల్ల విడిపోతున్నారు.చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే గొడ‌వ‌లు పడి అవి పెద్ద‌గై విడాకులు తీసుకునే వ‌ర‌కు వ‌స్తున్నాయి.

Increase Interaction Between Husband And Wife With These Tips- Telugu Viral News Increase Interaction Between Husband And Wife With These Tips--Increase Interaction Between Husband And Wife With These Tips-

దీంతోపాటు చాలా మంది దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త కూడా ఉండడం లేదు.అయితే కింద ఇచ్చిన ప‌లు వాస్తు టిప్స్ పాటిస్తే దంప‌తుల కాపురం హాయిగా సాగుతుంది.ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా ఇద్ద‌రూ అన్యోన్యంగా జీవించ‌వ‌చ్చు.మ‌రి దంప‌తులు పాటించాల్సిన ఆ వాస్తు టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

!

1.దంప‌త‌ల బెడ్‌రూంలో బెడ్‌రూం ఎల్ల‌ప్పుడూ ఉత్త‌రం, ఈశాన్యం లేదా నైరుతి దిశ‌ల‌లోనే ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఈ దిశల్లోనే వాస్తు ప్ర‌కారం ఎవ‌రైనా నిద్రించాల్సి ఉంటుంది.దీంతో నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది.

ఇక దంప‌తులు అయితే ఈ దిశ‌ల్లో నిద్రిస్తే వాస్తు దోషం పోతుంది.వారి దాంప‌త్యం అన్యోన్యంగా క‌ల‌కాలం ఉంటుంది.ఇలా నిద్రించ‌డం వ‌ల్ల బెడ్ రూంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

2.బెడ్‌రూంలో టీవీ, కంప్యూట‌ర్ వంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను అస్స‌లు ఉంచ‌రాదు.ఉంచితే అవి నెగెటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తాయి.దీంతో ఆరోగ్యం బాగుండ‌దు.

ఫ‌లితంగా దంప‌తులు సరిగ్గా కాపురం చేయ‌లేరు.క‌నుక ఆ వ‌స్తువుల‌ను బెడ్ రూంల‌లో పెట్ట‌రాదు.

3.దేవుళ్లు, దేవ‌త‌లు, త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు అంటే ఎంత ఇష్టం ఉన్నా స‌రే వాటి ఫొటోల‌ను బెడ్ రూంలో పెట్ట‌రాదు.

అందుకు బ‌దులుగా జంట ప‌క్షులు, జంట బొమ్మ‌లు పెట్టుకోవ‌చ్చు.ఇలా చేస్తే వాస్తు దోషం పోయి దంప‌తుల కాపురం హాయిగా ఉంటుంది.

4.దంప‌తులు నిద్రించే మాస్ట‌ర్ బెడ్ రూంలో బెడ్ త‌లుపుల‌కు ఎదురుగా ఉండ‌రాదు.

అలాగే ఒకే బెడ్‌పై దంప‌తులు నిద్రించాలి.ఇలా చేస్తే వాస్తు దోషం పోయి కపుల్స్ అన్యోన్యంగా ఉంటారు.

5.విరిగిన మంచం, చిరిగిపోయిన బెడ్ షీట్స్‌పై నిద్రించ‌రాదు.

అవి నెగెటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తాయి.క‌నుక వాటిని బెడ్ రూంలోంచి తీసేయాలి.ఇలా చేసినా వాస్తు దోషం పోయి దంప‌తుల హాయిగా కాపురం చేస్తారు.