రష్మిక వ్యవహారం.. పాతిక లక్షల పంగనామం!  

Income Tax Siezes 25 Lakhs From Rashika Mandanna-it Raids,rashmika Mandanna,sarileru Neekevvaru

ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.టాలీవుడ‌లో క్రేజ్ ఉన్న బ్యూటీగా రష్మిక తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.

Income Tax Siezes 25 Lakhs From Rashika Mandanna-it Raids,rashmika Mandanna,sarileru Neekevvaru-Telugu Gossips Income Tax Siezes 25 Lakhs From Rashika Mandanna-it Raids Rashmika Mandanna Sarileru Neek-Income Tax Siezes 25 Lakhs From Rashika Mandanna-It Raids Rashmika Mandanna Sarileru Neekevvaru

అయితే అమ్మడు వరుస సక్సె్స్‌ సినిమాల్లో నటించడంతో ఆమె తన రెమ్యునరేషన్‌ను ఎక్కువ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా కర్ణాటకలోని ఆమె ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ఉన్న రష్మిక నివాసంపై అధికారులు దాడి చేసి ఆమె లావాదేవీలపై విచారించారు.అయితే ఈ సమయంలో అమ్మడు షూటింగ్ కారణంగా బిజీగా ఉంది.

దీంతో ఆమె లావాదేవీలపై ఆమె తల్లిదండ్రులను విచారించారు.ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో వారు ఈ దాడులు నిర్వహించారు.

కాగా రష్మిక ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు ఆమె తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పలేకపోయారని, దీంతో ఆ ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.కాగా లెక్కల్లో చూపని రూ.25 లక్షల నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మరి ఈ వ్యవహారంపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు