కాల్‌సెంటర్ ఉద్యోగి మైండ్ బ్లాక్ చేసిన ఐటీ  

Income Tax Shocks Madhya Pradesh Man-income Tax,it,madhya Pradesh

ఎక్కువ సంపాదన ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి ఝలక్ ఇస్తారో మనకు తెలిసిందే.కాగా వారి పనితనం ఎలా ఉంటుందో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం.

Income Tax Shocks Madhya Pradesh Man-income Tax,it,madhya Pradesh Telugu Viral News Income Tax Shocks Madhya Pradesh Man-income It Madhya-Income Tax Shocks Madhya Pradesh Man-Income It

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఏకంగా కోటిన్నర ట్యాక్స్ వేసి తమ పనితనం ఎలా ఉంటుందో చూపించారు.కాగా తాజాగా వారి పనితనం మరోసారి వెలుగు చూసింది.

ఈసారి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాల్ సెంటర్ ఉద్యోగిపై తమ ప్రతాపం చూపించారు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు.బింద్ జిల్లాలో కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగికి రూ.3.49కోట్ల పెనాల్టీ నోటీసు పంపింది.ఈ నోటీసు చూసి సదరు ఉద్యోగి రవి గుప్తాకి మైండ్ బ్లాక్ అయ్యింది.ఈ షాక్ నుండి కోలుకోవడానికి అతడికి చాలా సమయమే పట్టింది.2011-12 సంవత్సరంలో తన పాన్ నెంబర్ మీద రూ.132 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిసి అతడు అవాక్కయ్యాడు.

కాగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు తన గోడును విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.దీంతో అసలు విషయం ఏమిటో అతడే రంగంలోకి దిగి తెలుసుకున్నాడు.

ముంబైలోని సూరత్‌ బేస్‌ వజ్రాల కంపెనీ అతడి పాన్ నెంబర్ మీద లావాదేవీలు జరిపినట్లు, అటుపై ఆ ఖాతాను తొలగించినట్లు తెలుసుకుని అతడు ఆందోళన చెందుతున్నాడు.ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ల తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు కోరుతున్నాడు.

తాజా వార్తలు