ఆ సీఎం ఇరుక్కుపోయినట్టేనా ..? ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరికాయా ..?  

Income Tax Department Raids Cm Ramesh\'s Houses In Telangana-

గత కొద్దిరోజుల క్రితం ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ, ఈడీ శాఖలు అక్రమాస్తులపై దాడులకు దిగారు. కీలక ఆధారాలు సంబంధించి ఫైళ్లు పట్టుకెళ్లారు. ఇవన్నీ రాజకీయ కుట్రలు అంటూ టీడీపీ నాయకులు కేంద్రం పై గొంతు పెంచారు..

ఆ సీఎం ఇరుక్కుపోయినట్టేనా ..? ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరికాయా ..? -Income Tax Department Raids CM Ramesh's Houses In Telangana

కానీ ఇప్పుడు ఆ హడావుడి కనిపించడం లేదని అంతా భావిస్తున్నారు. కానీ తెర వెనుక జరగాల్సినదంతా జరిగిపోతూనే ఉంది. ఆమధ్య కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు, ఎంఎల్ఏ పోతుల రామాారావుతో పాటు పలువురు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలపైన కూడా ఐటి, ఈడి దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఐటి దాడులకు గురైన వారంతా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులే కావటం గమనార్హం. ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చుట్టూ ఐటి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లే ఉంది.

మూడు రోజుల పాటు రమేష్ కు చెందిన ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవులు, హార్డ్ డిస్క్ లు తీసుకెళ్ళారు.

ఆ తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెటును విచారించినపుడు కీలకమైన సమాచారం దొరికిందని తెలుస్తోంది. డొల్ల కంపెనీలకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయట. అకౌంటెట్ చెప్పిన ప్రకారమైతే రూ 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సమాచారం. .

రిత్విక్ ప్రాజెక్ట్స్ నుండి రూ 74 కోట్ల మేరకు గుర్తుతెలీని లావాదేవీలు జరిగాయట. పై మొత్తానికి లెక్కలు చెప్పమని అడిగినపుడు అకౌంటెట్ సాయిబాబా చెప్పలేకపోయారట.

అలాగే మరో రూ 25 కోట్లకు అనుమానాస్పదమైన బిల్లులు దొరికినట్లు తెలిసింది. రిత్విక్ ప్రాజెక్స్ట్ నుండి సుమారు 6 సంవత్సరాలుగా ఎడ్కో ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి రూ 12 కోట్లు చెల్లించినట్లు గమనించారు. ఎడ్కో కంపెనీ కార్యకలాపాలేంటి ? కంపెనీ ఎక్కడుందని అడిగినపుడు సాయిబాబా ఏమీ సమాధానం చెప్పలేదట. దీంతో ఎడ్కో కంపెనీ డొల్ల కంపెనీ అని ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. తమ్ముడు పేరుతో పది డొల్ల కంపెనీలను పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్ళించారని మొదటి నుండి ఐటి అధికారులు అనుమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది..