ఐటీ నెక్స్ట్ టార్గెట్ ...'ఆ ఎమ్మెల్యేనే'...??  

ఏపీలో ఐటీ ప్రకంపనలు ఇప్పటికీ తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎటువైపు నుంచీ వస్తారో తెలియక నేతలకి హైపర్ టెన్షన్ పెరిగిపోతోందట. పడుకున్నా లేచినా కూర్చున్నా ఈ దాడుల తాలూకు వార్తలు గుర్తుకు రాగానే చెమటలు పడుతున్నాయట. ఇది సాదాసీదా వ్యవహారం అయితే పలుకుబడి ఉపయోగించి తప్పించుకోవచ్చు కాని పగ పట్టింది కేంద్రం కావడంతో అందులోనూ టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకూడదని పట్టుదలగా ఉండటంతో నేతలకి వెన్నులో వణుకు పుడుతోందట. ముఖ్యంగా

Income Tax Department Next Target TDP MLA-

Income Tax Department Next Target TDP MLA

టీడీపీలో హేమాహేమీలుగా చంద్రబాబు కి ఆర్ధిక అండదండలు అందించే ఆర్ధిక బలవంతులుగా పేరున్న అనుకున్న సుజనా చౌదరి , మంత్రి నారాయణ, సీఎం రమేష్ లాంటి వాళ్ళనే ఐటీ ముప్పు తిప్పలు పెడుతోంది. ఇవాలో రేపో సీఎం రమేష్ అరెస్ట్ తప్పదంటూ ఢిల్లీ వర్గాలనుంచీ సమాచారం ఉందంటూ లెక్కలు వేస్తున్నారు.. ఈ తరుణంలో మరొక సంచలన వార్త టీడీపీలోని ఆ జిల్లా ఎమ్మెల్యేలని వణికిస్తోందట..త్వరలో మరొక ఎమ్మెల్యే పై ఐటీ దాడులు జరగనున్నాయని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.

సదరు ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే కోట్ల సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారని అంతేకాదు చంద్రబాబు బినామీ అనే పేరు కూడా అక్కడ స్థానికంగా వినిపిస్తోందని తెలుస్తోంది..మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వంలో ఎవరికి ఎక్కడ ప్రమోషన్లు కావాలన్నా, లేదా ట్రాన్స్ఫర్లు కావాలన్నా సరే ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్తే చాలని పనులు చెకచెకా అయిపోతాయనే టాక్ కూడా వినిపిస్తోంది..కొన్ని రోజల క్రితం జరిగిన ఐటీ దాడులతో ఆ ఎమ్మెల్యే అప్రమత్తం అయినా సరే పూర్తి స్థాయి సమాచారం ఐటీ విభాగం వద్ద ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోగా బాబు ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టడమే కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.