క్యూబాపై ట్రంప్ కొరడా: అమెరికా నుంచి విమాన సర్వీసులపై నిషేధం

హవానా మినహా మిగిలిన క్యూబన్ నగరాలకు యూఎస్ విమానాలను నిషేధిస్తున్నట్లు ట్రంప్ సర్కార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.ఈ నిషేధం డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

 Inamericandonaldtrump Govttobanamerican Flights To All Cubancities Excepthavana-TeluguStop.com

క్యూబా ప్రభుత్వం అమెరికా రవాణా సంస్థల నుంచి ఎటువంటి ప్రయోజనం పొందకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో ట్వీట్ చేశారు.క్యూబాకు విమాన సర్వీసులను నిలిపివేయాల్సిందిగా రవాణా శాఖ కార్యదర్శి ఎలైన్ చావోను కోరినట్లుగా ఆయన తెలిపారు.

క్యూబాలో అమెరికన్ పర్యాటకాన్ని నిరోధించడమే తాత్కాలికంగా నిలిపివేయబడిన విమానాలకు మరొక కారణంగా పాంపియో ట్వీట్‌లో తెలిపారు.

అయితే ఈ చర్య వల్ల క్యూబా-అమెరికన్ పౌరులు ఆయా ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులు, సన్నిహితులను కలుసుకోలేరని.

రోడ్డు మార్గాన ప్రయాణించడం సాధ్యపడదని కొందరు విమర్శిస్తున్నారు.కాగా క్యూబా ప్రజల సంక్షేమం కోసం ఆ దేశానికి అమెరికా గత కొన్ని నెలలుగా ఆర్ధిక సాయం చేస్తోంది.

అయితే క్యూబా ప్రభుత్వం ఆ నిధులను పౌరులను అణచివేయడానికి, వెనిజులా నియంత నికోలస్ మదురోకు అందజేస్తుండటంతో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.క్యూబా మరియు వెనిజులాలో కొనసాగుతున్న సంక్షోభాలయు క్యూబా ప్రభుత్వం , వెనిజులా నియంత నికోలస్ మానవ హక్కులకు ప్రాధాన్యతనివ్వకపోవడమే కారణమని పాంపియో గత నెలలోనే ఆరోపించారు.

Telugu Cuba, Cuban Havana, Donald Trump, Telugu Nri Ups-

  మదురో ప్రభుత్వాన్ని రక్షించడానికి వెనిజులాలో సుమారు 20,000 మంది క్యూబన్ దళాలు మరియు ఏజెంట్లు పనిచేస్తున్నారని అమెరికా ప్రభుత్వం వాదిస్తోంది.వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడంతో పాటు రెండు దేశాల్లో అతిపెద్ద సంక్షోభాన్ని ప్రేరేపించడంతో నాటి క్యూబా నియంత ఫిడెల్ క్యాస్ట్రో ప్రయత్నించాడన్నది అమెరికా ఆరోపణ.అంతేకాకుండా వెనిజులా జనాభాలో 15 శాతం మంది దేశం విడిచి పారిపోయేలా చేశారని.ఆయన చర్యలతో తీవ్రమైన ఆహార కొరత మరియు ఆరోగ్య సంక్షోభాన్ని ఈ ప్రాంతం ఎదుర్కోవాల్సి వచ్చిందని పాంపియో వ్యాఖ్యానించారు.

మరోవైపు గత నెలలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ట్రంప్.వెనిజులా అధినేత నికోలస్‌ను క్యూబన్ తోలు బొమ్మ అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube