వైజాగ్‌, బెజ‌వాడ రెండు చోట్లా వైసీపీకి ఆ ఇద్ద‌రే దెబ్బేశారా.. అధిష్టానంలో గుబులు ?

ఏపీలో కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి.ఏ కార్పొరేష‌న్లో ఏ పార్టీ పాగా వేస్తుందో ?  తెలియాలంటే ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.ఇదిలా ఉంటే విప‌క్ష టీడీపీ ముందు నుంచే విజ‌య‌వాడ‌, వైజాగ్ కార్పొరేష‌న్ల‌పై భారీ ఆశ‌లు పెట్టుకుంది.అటు అధికార పార్టీ సీమ‌తో పాటు ప‌లు కార్పొరేష‌న్ల‌లో సులువుగా గెల‌వ‌వ‌చ్చ‌న్న ధీమాతో టీడీపీకి ప‌ట్టున్న‌… టీడీపీకి ఆశ‌లు ఉన్న విజ‌య‌వాడ‌, వైజాగ్ కార్పొరేష‌న్ల మీదే గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేసింది.

 In Vizag And Bejawada Did Those Two Hurt The Ycp ,ap,ap Political News,latest Ne-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించారు.అటు వైజాగ్ బాధ్య‌త‌లు మంత్రి కురసాల క‌న్న‌బాబుతో పాటు అవంతి శ్రీనివాస్‌.

ఇక వీరిద్దరి క‌న్నా ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయి రెడ్డి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు.వైజాగ్‌లో గెలుపు జ‌గ‌న్ కు ఎంత కీల‌కమో… ఇటు విజ‌య‌సాయికి కూడా అంతే కీల‌కం.

వైసీపీ చావో రేవో గా తీసుకున్న ఈ రెండు కార్పొరేష‌న్ల‌లో క్లాస్ ఓటింగ్ ఆ పార్టీకి దెబ్బేసింద‌న్న విశ్లేష‌ణ‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో వైసీపీ అధిష్టానంలో కొత్త గుబులు మొద‌లైంది.

Telugu Ap, Chandra Babu, Class, Ycp, Vizag Bejawada, Latest, Visakha Steel, Ysrc

బెజ‌వాడ‌లో ఎప్పుడూ మాస్ ఓటింగ్ ఎక్కువ‌… క్లాస్ బ‌య‌ట‌కు వ‌చ్చి ఓట్లేయ‌రు.ఈ సారి కేశినేని శ్వేత ఎఫెక్ట్‌తో పాటు ఆమెను పార్టీ మేయ‌ర్‌గా ముందే ప్ర‌క‌టించ‌డంతో క్లాస్ బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీకి ఓట్లేశార‌ని అంటున్నారు.జ‌గ‌న్ హ‌యాంలో క్లాస్ ప్ర‌జ‌ల‌కే ఎక్కువ దెబ్బ త‌గిలింది.

అందుకే ఈ సారి వారంతా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఓట్లేశార‌ని అంటున్నారు.ఇక వైజాగ్‌లో ముందు నుంచి వైసీపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఉన్నా చివ‌రి రెండు రోజుల్లో సీన్ మారిపోయింది.

ఎప్పుడు అయితే నిర్మలా సీతారామ‌న్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విషయంలో దాదాపు క్లారిటీ ఇచ్చేశారో… దీనిని టీడీపీ, జ‌న‌సేన‌లు బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాయి.దీంతో అక్క‌డ కూడా క్లాస్ పీపుల్ అపార్ల్‌మెంట్లు వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ ఓట్లేశారు.

అందుకే ఈ రెండు చోట్ల క్లాస్ ఓటింగ్ గుబులు ఇప్పుడు వైసీపీని టెన్ష‌న్ పెట్టేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube