ఈ వారం 9 సినిమాలు రాబోతున్నాయి.. ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది

కరోనా లాక్ డౌన్ తో మూత పడ్డ థియేటర్లు ఎట్టకేలకు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.సంక్రాంతి సీజన్ నుండి సినిమాల విడుదల సందడి మొదలు అయ్యింది.

 In Tollywood Including Check 9 Movies Are Releasing This Week-TeluguStop.com

అయితే సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలంటూ మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు.ఎట్టకేలకు 100 శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెప్పారు.

దీంతో పెద్ద ఎత్తున సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి.గత రెండు మూడు వారాలుగా సినిమాలు ఒకటి రెండు చొప్పున విడుదల అవుతున్నా కూడా ఈ వారంలో మాత్రం ఏకంగా 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 In Tollywood Including Check 9 Movies Are Releasing This Week-ఈ వారం 9 సినిమాలు రాబోతున్నాయి.. ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లాక్ డౌన్ తర్వాత ఈ స్థాయిలో సినిమాలు విడుదల కావడం ఇదే ప్రథమం.దాంతో సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారని అంతా అనుకున్నారు.

కాని ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాల్లో కేవలం నితిన్ నటించిన చెక్ సినిమా కోసం మాత్రమే ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చెక్‌ సినిమా ఇప్పటికే పాజిటివ్‌ టాక్ దక్కించుకుంది.

నితిన్‌ సినిమాపై అంచనాలు పెంచేలా రాజమౌళి ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.సినిమా ఖచ్చితంగా మరో లెవల్‌ లో ఉంటుందని ఇన్నాళ్ల తర్వాత ఒక సినిమాను థియేటర్‌ లో చూడాలని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

దాంతో చెక్‌ సినిమా మ్యాటర్ ఉందని అనిపించుకుంది.పెద్ద ఎత్తున సినిమా ను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే విడుదలై సక్సెస్ టాక్ ను దక్కించుకున్న ఉప్పెన మరియు నాంది సినిమాలు జోరు తగ్గాయి.

కనుక ఈ సినిమా వసూళ్ల పరంగా నితిన్ కు బెస్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.చెక్‌ తో పాటు ఇంకా అక్షర, ఏప్రిల్‌ 28న ఏం జరిగింది, అంగుళీక, లాయర్‌ విశ్వనాథ్‌, బాల మిత్ర, క్షణం క్షణం, నువ్వు నేను ఒక్కటైతే, ఎమ్‌ఎమ్‌ ఆఫ్‌ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

చెక్‌ తప్ప మిగిలినవి అన్ని కూడా వారం రోజుల సినిమాలే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆ సినిమాలు ఆడే అవకాశం లేదు.

అందుకే చెక్‌ ఒక్క సినిమాపై మాత్రమే అంచనాలు భారీగా ఉన్నాయి.

Telugu 9 Movies, Akshara, Anguleeka, April 28 Em Jarigindi, Check, Check Movie, Corona Movies, Film News, Hero Nithin, Kshanam Kshanam, Lawer Viswanath, Lock Down Movies, Nithin, Nuvvu Nenu Okkataite, Pre Release, Rajamouli, This Week-Movie.

#Kshanam Kshanam #Hero Nithin #Akshara #April28 #NuvvuNenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు