తిరుమలలో "శిలువ తరహా లైటింగ్"

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి వేడుకలను టీటీడీ పాలకమండలి ఘనంగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

 In Tirumala Hills Yesu Siluva Lighting Goes Viral,ap,ttd,vikunta Akadashi,thalap-TeluguStop.com

ఈ విషయంపై టీటీడీ పాలక మండలి పలు సందర్భాల్లో జవాబు ఇస్తూ వాటిని కొట్టిపారేసింది.తాజాగా వైకుంఠ ఏకాదశి రోజున శిలువ రూపంలో లైట్స్ ను ఏర్పాటు చెయ్యడంతో వైసీపీ ప్రభుత్వంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ శిలువ లైటింగ్ తరహా ఏర్పాటు విషయంను “తాళపత్ర నిధి” అనే ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ విషయంపై టీటీడీ పాలక మండలి “తాళపత్ర నిధి” పేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు కేస్ ను నమోదు చేసింది.

తిరుమల ఆలయ ప్రకారాలపై ఎప్పటిలాగే హనుమంత, గరుడ, పూర్ణకుంభం ఆకారాలతో లైటింగ్ ఏర్పాటు చేశారు.వాటిలోని పూర్ణ కుంభంను టెక్నాలజి సహాయంతో మార్పులు చేసి శిలువ రూపంలోకి మార్చారు.

అల మార్చిన ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ చేశారని టీటీడీ ఆరోపించింది.అలాగే తిరుమల కొండపై కొంత మంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చెయ్యడం వల్లే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తుంది.

అలాంటి తప్పుడు ప్రచారాలను ఇకపై చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాంని టీటీడీ హెచ్చరించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube