ఆ రెండు విష‌యాల్లో వైసీపీకి క‌లిసొచ్చిన టైమ్‌.. పండ‌గ చేసుకుంటున్న పార్టీ

ఇప్పుడు ఏపీలో వైసీపీ జోష్ న‌డుస్తోంద‌నే చెప్పాలి.ఆ పార్టీ సెట్ చేసిందే ట్రెండ్ అన్న‌ట్టు రాజ‌కీయాలు సాగుతున్నాయి.

 In Those Two Matters, It Is Time For The Ycp To Come Together. The Party Is Cele-TeluguStop.com

ఇప్ప‌టికే జ‌రుగుతున్న అన్ని ఎన్నికల్లో కూడా టీడీపీకి ఎక్క‌డా అవ‌కాశం ఇవ్వ‌కుండా సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేస్తోంది.ఇలంటి త‌రుణంలో గడిచిన గ‌తీ సంవ‌త్సంర కాలంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని ఆనందం వైసీపీలో ఇప్పుడు కనిపిస్తోంద‌ని చెప్పాలేమో.

ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓ అంశంపై ఇప్పుడు వారికి క‌లిసిరావ‌డం, దాంతో పాటు మ‌రో విష‌యంలో కూడా ప్ర‌భుత్వానికి మేలు జ‌ర‌గ‌డం.

కొద్ది కాలంగావైసీపీలో ఓ అంశం తీవ్రమైన అలజడులు రేపింది.

ఇక దాంతో పాటు వ‌రుస‌గా ప్ర‌భుత్వంపై కూడా కోర్టుల నుంచి మొట్టికాయలు ప‌డ‌టం పెద్ద‌ స‌మ‌స్య‌గా మారింది.ఇక తాము తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌పై కూడా వ్య‌తిరేక‌త రావ‌డంతో అంతా నిరాశ చెందారు.

ఇక ఏవైనా ప‌నులు చేయాలంటే అప్పుల‌కు కూడా కేంద్రం నుంచి ప‌ర్మిష‌న్‌లు రాక‌పోవ‌డంతో అంతా నిరాశ‌లో ఉన్నారు.ఇలాంటి త‌రుణంలో రెబ‌ల్ ఎంపీ రఘురామరాజు కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిష‌న్ ఇప్పుడు కొట్టేశారు.

దీంతో పెద్ద గండం నుంచి బ‌య‌ట‌ప‌డ్డామంటూ అంద‌రూ ఆనంద‌ప‌డ్డారు.

Telugu Ap, Cacel, Cbi, Jagan, Raghurama, Ycp Mp, Ys Jagan-Telugu Political News

ఎందుకంటే ఈ అంశంపై ఎప్ప‌టి నుంచో వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఒక‌వేళ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయితే పార్టీ పరిస్థితి ఏంటని, సీఎంగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు సాగుతున్నాయి.ఇలాంటి త‌రుణంలో పిటిష‌న్ ర‌ద్దు కావ‌డం క‌లిసొచ్చే అంశ‌మ‌నే చెప్పాలి.

ఇక‌పోతే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా హైకోర్టు నుంచి నుకూలమైన తీర్పు రావ‌డం వైసీపీకి క‌లిసివ‌చ్చే అంశం.ఈ రెండు విష‌యాల్లోనే కాకుండా రీసెంట్ గా కేంద్రం నుంచి వైసీస‌పీ ప్ర‌భుత్వానికి అప్పుల కోసం ప‌ర్మిష‌న్ రావ‌డంతో అన్ని విధాలుగా క‌లిసి వ‌స్తోంద‌ని అంద‌రూ పండ‌గ చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube