కన్నీరు రావడం లేదని నిజంగానే హీరోయిన్‌ ను కొట్టాడట

నందిని రాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమా నేడు ఆహా లో స్ట్రీమింగ్‌ అయ్యింది.సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

 In The Name Of God Film Heroine Nandini Rai Slap By Vivek-TeluguStop.com

కొన్ని సన్నివేశాల్లో నందిని రాయ్‌ నటన ఆకట్టుకునే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇదే సమయంలో ఆమె అందాల ఆరబోత మామూలుగా లేదుగా అంటూ మరి కొందరు ఆహా ఓహో అంటున్నారు.

ఈ సమయంలోనే ఈ అమ్మడికి సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తో మాట్లాడుతూ స్వయంగా నందిని రెడ్డి ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది.

 In The Name Of God Film Heroine Nandini Rai Slap By Vivek-కన్నీరు రావడం లేదని నిజంగానే హీరోయిన్‌ ను కొట్టాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నందిని రాయ్ చెప్పుకొచ్చింది.

వివేక్ తో సన్నివేశం చిత్రీకరిస్తు ఉన్నారు.

ఆ సన్నివేశంలో నందిని రాయ్‌ ను వివేక్ చెంపపై కొట్టాలి.నందిని రాయ్ కంట్లోంచి నీళ్ల రావాలి.

ఈ రెండు ఒకే షాట్‌ లో జరగాలి.అలా జరగాలంటే మామూలు విషయం కాదు.

చెంప మీద కొట్టినట్లుగా వివేక్‌ యాక్టింగ్‌ చేస్తున్నాడు.కాని ఫీల్‌ రావడం లేదు నొప్పి బాధను అనుభవించినట్లుగా అనిపించడం లేదు.

పైగా కన్నీరు కూడా రావడం లేదు.దాంతో నందిని రాయ్ స్వయంగా తనను కొట్టమంటూ చెప్పిందట.

వివేక్‌ కు బలంగా కొట్టమని చెప్పడంతో అతడు తడబుడుతూనే కొట్టేశాడట.

Telugu Aha Ott, Aha Ott Relese, Film News, In The Name Of God, Nandini Rai, News Is Telugu, Tollywood-Movie

దాంతో అతడి దెబ్బకు నందిని రాయ్ కంట నీరు రావడంతో పాటు ఒక్క దెబ్బతో టేక్ ఓకే అయ్యిందట.హీరోయిన్‌ నందిని రాయ్ డెడికేషన్ ను ఆ సమయంలో అందరు మెచ్చుకున్నారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.నందిని రాయ్ తెలుగు లో బిగ్‌ బాస్‌ తో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఆ తర్వాత కూడా పలు వెబ్‌ సిరీస్ లు మరియు సినిమా ల్లో నటించి మెప్పించింది.

#Nandini Rai #Aha Ott Relese #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు