క‌రోనాతో 130రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే.. వంద‌ల‌మంది చావుల‌ను చూశాడ‌ట‌..

క‌రోనా వైర‌స్ ప్రుపంచాన్ని ఎంత‌లా అత‌లాకుత‌లం చేసిందో అంద‌రికీ తెలిసిందే.దాని ధాటికి అన్ని దేశౄలు విల‌విల లాడుతున్నాయి.

 In The Hospital For 130 Days With Corona .. Hundreds Of Deaths Were Witnessed ..-TeluguStop.com

ఇప్ప‌టికే చాలామంది దీని బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు.వేలాది మంది ఆస్ప‌త్రుల బారిన ప‌డుతున్నారు.

ఇక సెకండ్‌వేవ్ త‌ర్వాత భార‌త‌దేశంలో మొన్న‌టి వ‌ర‌కు కాస్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు త‌గ్గినా కూడా ఇప్పుఉడ మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుదల స్ప‌ష్టంగా కనిపిస్తోంది.ఇక దేశ వ్యాప్తంగా 30, 570 పాజిటివ్ కేసులు రావ‌డంతో మ‌ళ్లీ ఉలికి్క‌ప‌డింది భార‌త‌దేశః.

అయితే క‌రోనా కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరుతున్నా కూడా చాలా వ‌ర‌కు 20నుంచి 30 రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ఉంటున్నారు.కానీ ఓ వ్య‌క్తి మాత్రం క‌రోనా బారిన పడిన ఏకంగా 130 రోజుల పాటు ఆస్ప‌త్రి బెడ్ మీద‌నే సుదీర్ఘ పోరాటం కొన‌సాగించాడు.

ఇక ఇన్ని రోజుల త‌ర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.ఆయ‌నే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన విశ్వాస్ సైనీ.ఆయ‌న గ‌తేడాది ఏప్రిల్ 28న పాజిటివ్ రావ‌డంతో అప్టి నుంచి ఆస్ప‌త్రిలోనే ఉన్నారు.మ‌ధ్య‌లో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా కూడా మ‌ళ్లీ పాజిటివ్ రావ‌డంతో ఆరోగ్యం కుదుటపడక తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారట‌.

Telugu Days, Carona, Coron Aupadte, Corona, India, Wave, Uttar Pradesh-Latest Ne

ఇక ఆయ‌న ఆరోగ్యం బాగా దెబ్బ‌తిన‌డంతో డాక్ట‌ర్లు కూడా ఆయ‌న్ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ఇక్క‌డే ఉంచుకున్నారంట‌.ఇక ఇత‌ని శరీరం చాలా రోజుల దాకా ట్రీట్ మెంట్‌కు స్పందించక‌పోవ‌డంతో కోలుకోవ‌డానికి ఇన్ని రోజులు ప‌ట్టింద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.అయితే ఆయ‌న ఇలా ఆస్ప‌త్రిలో ఉన్నంత కాలం ఎంతోమంది తన కండ్లుముందు చ‌నిపోయార‌ని, అది త‌న‌ను బాధించినంది, తాను ఆస్ప‌త్రి బెడ్ మీద ఉండ‌గా వంద‌లాది మంది చావుల‌ను చూశానంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు.కానీ డాక్ట‌ర‌ల్ఉ అందించిన సేవ‌లు మాత్రం అమోఘం అంటూ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube