రెడ్డి వర్సెస్ రెడ్డి ? అధిష్టానం పట్టించుకోదా ? 

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువగా ఉండడంతో పాటు, మొదటి నుంచి వారి హవానే నడుస్తూ వస్తోంది.పార్టీ సీనియర్ నాయకులలో ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే.

 In The Case Of Rewanth Reddy Komatireddy Venkatereddy The Congress Supremacy Is-TeluguStop.com

దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.అయితే ఇదే పదవిపై కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపించింది.

రేవంత్ సారథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అధిష్టానం బలంగా నమ్ముతోంది.అందుకే ఆయనకు ఆ పదవిని కట్టబెట్టింది.

అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేగింది.పార్టీ సీనియర్ నాయకులు అంతా అసంతృప్తి తో రేవంత్  నాయకత్వం ను ఒప్పుకునేది లేదు అన్నట్లు వ్యవహరించటం వంటి ఎన్నో పరిణామాలు జరిగాయి.

చివరకు రేవంత్ అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి మరీ, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయడం తో సీనియర్ నాయకులంతా రేవంత్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు గా వ్యవహరించారు.
        ఇదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సానుకూలత తో ఉన్నట్లు గా వ్యవహరించారు.

అయితే గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ ను లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సభకు విజయమ్మ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు.ఆ సమావేశానికి ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసినా,  వాటిని పట్టించుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సమావేశానికి వెళ్లడం పై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతల తీరును తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నారు.

గతంలోనూ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దర్శన సమయం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ డబ్బులకు అమ్ముడు పోయడు అంటూ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు.
   

Telugu Congress, Komati Venkat, Manikyam Tagore, Reddy, Revanth Reddy, Telangana

    దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అవడంతో పాటు, మాణిక్యం ఠాగూర్ షోకాజ్  నోటీసు జారీ చేశారు.ఆ వ్యవహారం కొద్దిరోజుల తర్వాత సైలెంట్ అయిపోయింది.ఇలా పదే పదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నాయకులపై  విమర్శలు గుప్పిస్తున్నా , కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గొడవ ఎప్పుడూ ఉండేదే అని, ఈ విషయంలో కల్పించుకున్నా, మళ్లీ యథావిధిగానే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టి వేస్తుస్తున్నాయి.

ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా వివాదాలు రోజు రోజుకు ముదురుతూనే ఉన్నాయి.

   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube