ఆ విషయంలో కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మారిన పాడి కౌశిక్ రెడ్డి...

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే విషయం చాలా సార్లు రుజువయింది.ఒకప్పుడు సదరు పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పెద్ద పీట వేసిన ఘటనలు చాలా చూసాం.

 In That Regard Kaushik Reddy Who Has Become A Thorn In The Side Of The Congress-TeluguStop.com

ప్రజలకు కొంత వింతగా అనిపించినా రాజకీయ నాయకులకు మాత్రం ఇది పెద్ద విషయంగా అనిపించదు.ఎందుకంటే రాజకీయాల అసలు ఉద్దేశ్యం, అసలు రంగు వాళ్లకు అంతర్గతంగా తెలుసు కాబట్టి.

ఇది ఒక వైపు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే ఈటెల రాజేందర్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

 In That Regard Kaushik Reddy Who Has Become A Thorn In The Side Of The Congress-ఆ విషయంలో కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మారిన పాడి కౌశిక్ రెడ్డి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఈటెలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఈటెల భూ కుంభకోణాలపై తీవ్రంగా లైవ్ డిబేట్ లో తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.అయితే త్వరలో ఈటెల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఈటెల విమర్శిస్తుండటం కాంగ్రెస్ కు తల నొప్పిగా మారింది.

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు పాడి కౌశిక్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారిన పరిస్థితి ఉంది

.

#CongressLeader #Koushik Reddy #Etela Rajender #Congress Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు