అక్క‌డ‌ టీడీపీలో ఎవ‌రి గోల వారిదే... !

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో ఒక విధ‌మైన స్త‌బ్ద‌త చోటు చేసుకుంది.ఇక్క‌డ కీల‌క‌మైన నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.

 In That Place Tdp Leaders Became Disturbance, Tdp, Chandra Babu, Disturbance, Pr-TeluguStop.com

ఎవ‌రూ ప‌న్నెత్తి మాట్లాడ‌డంలేదు.కాలు క‌దిపి.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చేరువ కావ‌డ‌మూ లేదు.దీంతో ఏమైంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.జిల్లా పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న దామ ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ బాగానే చ‌క్రం తిప్పారు.

అంతా నేనే అన్న‌ట్టుగా పార్టీని ముందుకు న‌డిపించారు.చంద్ర‌బాబు సైతం ఆయ‌న‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.

కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను కూడా ఆయ‌న‌కే అప్ప‌గించారు.అయితే.

అనూహ్యంగా పార్టీ ఓడిపోయింది.

పార్టీ త‌ర‌పున పోటీ చేసిన వారిలోనూ దామ‌చ‌ర్ల అనుచ‌రులు కానీ.

మిత్రులు కానీ లేక‌పోవ‌డం.స్వ‌యంగా ఆయ‌నే ఓడిపోవ‌డం వంటివి చోటు చేసుకున్నాయి.

ఇక‌, అప్ప‌టి నుంచి దామ‌చ‌ర్ల యాక్టివిటీ త‌గ్గిపోయింది.ఇదిలావుంటే.

పార్టీలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ద‌వుల్లోనూ తాను ఆశించిన ప‌ద‌వి ఏదీ కూడా జ‌నార్ద‌న్‌కు ద‌క్క‌లేదు.ఇది మ‌రింత‌గా ఆయ‌న‌ను వేధించ‌డం ప్రారంభించింది.

ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.పార్టీలో గెలుపు ఓట‌ములు సాధార‌ణ‌మే అయినా.

ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి టికెట్ ఇప్పించుకున్న వారు సైతం ఓడిపోవ‌డం వెనుక‌.ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు ఆరాతీశారు.

Telugu Ap, Chandra Babu, Disturbance, Jagan, Janardhan, Karnam Balaram, Prakasam

దీంతో జ‌నార్ద‌న్ అంద‌రినీ క‌లుపుకొని పోలేద‌ని. వైసీపీని త‌క్కువ‌గా అంచ‌నా వేసుకున్నార‌ని.అందుకే పార్టీ ఓడింద‌ని స‌మాచారం అందింది.దీంతో జ‌నార్ద‌న్‌ను చంద్ర‌బాబు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.మ‌రోవైపు.ఆయ‌న సోద‌రుడు స‌త్య‌.

ద‌ర్శిపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎవ‌రూ టీడీపీకి అండ‌గా లేరు.

మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు.వైసీపీలోకి వెళ్లిపోయారు.

దీంతో ఇక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న చూస్తున్నారు.కానీ, పార్టీ పునాదుల‌కే ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాలు పంచుకోవ‌డం ఏంట‌నేది ప్ర‌శ్న‌.

మ‌రోవైపు ఈ జిల్లా నుంచి న‌లుగురు గెలిచారు.అయితే.

ఏ ఒక్క‌రూ కూడా స‌ఖ్య‌త‌గా ముందుకు సాగ‌డం లేద‌నేది వాస్త‌వం.గొట్టిపాటి ర‌వి, ఏలూరి సాంబ‌శివ‌రావు, బాల వీరాంజ‌నేయులు, క‌ర‌ణం బ‌ల‌రాం గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి.

టీడీపీ ప‌రువు నిల‌బెట్టారు.అయితే.

వీరిలో క‌ర‌ణం పార్టీకి దూర‌మ‌య్యారు.బాల వీరాంజ‌నేయులు.

.ఎవ‌రినీ లెక్క‌చేయ‌డం లేదు.ఇక‌, గొట్టిపాటి ఉండాలా వెళ్లాలా? అనే మీమాంస‌లో ఉన్నారు.ఇక‌, ఏలూరి త‌న దారిలో తాను ప‌య‌నిస్తూ.

త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు క్లీన్‌గా చూసుకుంటున్నారు.దీంతో ఎవ‌రూ పార్టీని పూర్తిగా ప‌ట్టించుకుంటున్న ప‌రిస్తితి లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube