ఆ విషయాలు తీవ్రంగా బాధపెట్టాయంటున్న మోడీ..!

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడేందుకు మోదీ మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంని తిరిగి మొదలు పెట్టారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

 In That Issue Narendra Modi, Narendra Modi, Man Ki Bath, Coronavirus, Hyderabad,-TeluguStop.com

ఇక నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు.

ఇక జనవరి 26న ఎర్రకోట జరిగిన రైతులు సంఘటన తనని కలిసి వేసిందని మోదీ వెల్లడించారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దేశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని అర్జెంటీనా అధ్యక్షుడు మెచ్చుకున్నారని వెల్లడించారు.అంతేకాక దేశంలో కొందరి సేవలను గుర్తించి వారికి అవార్డులు అందజేయటం జరిగిందని మోదీ తెలిపారు.ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించిందని, తొలి టెస్ట్ మ్యాచ్ ‌లో ఓటమి అనంతరం పుంజుకొని.సిరీస్‌ను గెలిచిందని చెప్పారు.

టీమిండియా పోరాటతత్వం అమోఘమని చెప్పారు.

Telugu Coronavirus, Hyderabad, Ki Bath, Narendra Modi, Vaccine-Latest News - Tel

ఇక మరోవైపు, కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఇవాళ 72వ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా గొలుసు సరఫరా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు.

ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయన్నారు.అయితే ఈ కాలంలో భారత్‌ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు.

ఈ సామర్థ్యాలనే ‘ఆత్మనిర్భర్ భారత్​’ గా అభివర్ణించారు.

అంతేకాక మోదీ మన్ కీ బాత్ లో హైదరాబాద్ బోయిన్ పల్లి సబ్జీ మండి గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు.

సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు.బోయినపల్లి సబ్జీ మండి వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని అన్నారు.సబ్జీ మండిలో ప్రతి రోజూ 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు.30 కేజీల జీవ ఇందనం కాకుండా 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube