తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ తప్పదా ...?

అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగింది.ముఖ్యంగా తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి దారుణంగా పెరిగింది.మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.ఇక ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు.మరోవైపు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ కి కరోనా పాజిటివ్ రావడంతో రాజకీయ నాయకులు కూడా ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.

 In Telangana Wants One More Time Need A Complete Lockdown, Coronavirus, Telangan-TeluguStop.com

Telugu Corona, Coronavirus, Gachibowli Kims, Gandhi, Ghmc, Hyderabad, Telangana-

అయితే హోంశాఖ మంత్రి కి గత మూడు రోజుల క్రితమే ఆస్తమా ఎక్కువవడంతో ఆయన్ని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.అక్కడ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.ఇక ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో పూర్తిగా లాక్ డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది అని అర్థమవుతోంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల శాతం చాలా తక్కువ ఉందని మంత్రి ఈటల రాజేంద్ర తెలియజేశారు.

నిజానికి కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కూడా కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కొరకు స్పెషల్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామని, నేటి నుండి కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేపడతామని ఆయన తెలియజేశారు.

రాబోయే వారం రోజుల్లో ఏకంగా పది వేల బెడ్స్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

Telugu Corona, Coronavirus, Gachibowli Kims, Gandhi, Ghmc, Hyderabad, Telangana-

ఈ నేపథ్యంలో కేవలం జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తంగా లాక్ డౌన్ వేధించడం మంచిదని కొంతమంది సూచిస్తున్నారు.దీనికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోవ్యాపార రంగ సంస్థలు స్వచ్ఛందంగా వారి సమయం వేళ విషయాలలో నియంత్రణ పాటిస్తున్నాయి.సాయంత్రం ఐదు గంటలయితే సరి షాపులను మూసేస్తున్నారు.

ఇదే నేపథ్యంలో తెలంగాణలో ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్ర సర్కారు వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయుటకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని పంపించారు.ఈ కేంద్ర బృందం సోమవారం నాడు గచ్చిబౌలి లోని కిమ్స్ ఆస్పత్రి అని పరిశీలించి కరోనా నివారణ చర్యలపై ఆరా తీసింది.

అంతేకాకుండా ఈ బృందం గాంధీ ఆసుపత్రి, కంటైన్మెంట్ ప్రాంతాలలో కూడా పర్యటన చేసింది.ఈ బృందం ఇచ్చే నివేదిక పై రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అర్థమవుతుంది.

Telugu Corona, Coronavirus, Gachibowli Kims, Gandhi, Ghmc, Hyderabad, Telangana- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube