కేఏ పాల్ దూకుడు వెనుక ఎవరంటే ? 

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. మత ప్రబోధకుడు కె ఏ పాల్ దృష్టిపెట్టి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

 Bjp Is The Reason For Kc Paul Speed In Talangana Politics Details, Ka Paul, Kcr-TeluguStop.com

తెలంగాణ అంతటా పర్యటిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని పాల్ ప్రకటనలు చేస్తున్నారు.ఇప్పటికే టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు తెలంగాణలో చాలానే ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల సైతం కొత్త పార్టీ పెట్టారు.కెసిఆర్ ను టార్గెట్ చేసుకుంటూ ఆమె విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ అంతటా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు కేఏపాల్ దూకుడు పెంచడంతో టిఆర్ఎస్ ఆయన పైన ఫోకస్ పెట్టింది.

ఇటీవల కేసీఆర్ ను విమర్శిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన నాయకులు పాల్ పై దాడికి పాల్పడ్డారు.దీంతో పాల్ మరింతగా ప్రచారం లోకి వచ్చారు.అయితే కేఏ పాల్ పై టీఆర్ఎస్ కు చెందిన వారు దాడి చేయడం తో పాల్ కేంద్ర బిజెపి పెద్దలకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఆయన కలిసి ఫిర్యాదు చేశారు.

  మామూలుగా అయితే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేకసార్లు ఎదురుచూస్తూ ఆయన అపాయింట్మెంట్ దొరక్క తిరిగి వెళ్లిపోయిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

Telugu Amith Shah, Bjp Ka Paul, Central, Ka Paul, Prajashanthi, Telangana-Politi

కానీ టిఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేయడానికి పాల్ రావడం వెంటనే ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో పాల్ వెనుక బీజేపీ ఉందనే విషయం తెరపైకి వచ్చింది.టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను కొంత మేరయినా చీల్చేందుకు ఈ విధమైన ఎత్తుగడను వేసారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2019 ఎన్నికల సమయంలో ఏపీలో కే ఏ పాల్ పార్టీ అభ్యర్థి పోటీ చేశారు.అన్ని చోట్ల ఘోర పరాజయాన్ని చవి చూశారు.ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పై ఆయన ఫోకస్ పెట్టడానికి కారణం కేంద్ర బిజెపి పెద్దలే అనే విషయం తెరపైకి వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube