తెలంగాణలో ఇకపై అవి బ్యాన్‌

అక్టోబర్‌ 2 నుండి కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ఆ బ్యాన్‌ తెలంగాణలో ఎక్కువగా అమలు అవుతున్నట్లుగా కనిపించడం లేదు.

 In Telangana Single Use Plastic Covers Banned Cm Kcr Order-TeluguStop.com

అక్కడక్కడ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్స్‌ మరియు చెత్తలో ప్లాస్టిక్‌ విచ్చలవిడిగా కనిపిస్తూనే ఉంది.కేంద్రం నిర్ణయం అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపించాల్సిందే.

తెలంగాణ ప్రభుత్వం అందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది.కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై తెలంగాణలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిస్తున్నట్లుగా ప్రకటించాడు.అందుకు సంబంధించిన ఆదేశాలను మంత్రి వర్గంలో చర్చించి ఆదేశాలు, ఆర్డినెన్స్‌ తీసుకు రాబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు.

పల్లెల్లో మరియు పట్టణాల్లో పూర్తిగా సింగిల్‌ యూజ్‌ కవర్లను బ్యాన్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ప్రకటించాడు.పరిశుభ్రమైన గ్రామాలు మరియు పరిశుభ్రమైన ఇళ్లను గుర్తించి వారికి పురష్కారాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా ఈ సందర్బంగా కేసీఆర్‌ ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube