తెలంగాణలోనూ దానిపై నిషేదం

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ప్రతి రోజు కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ చర్యలకు ఉపక్రమిస్తూనే ఉంది.

 In Telangana Pan And Guttka Prohibited, Telangana, Telangana Health Deportment,-TeluguStop.com

తాజాగా యూపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తంబాకు, గుట్కాలు తిని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే వెంటనే వారికి శిక్ష విధించడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాను విధించనున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.తాజాగా తెలంగాణలో కూడా అదే విధానంను కొనసాగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా రాష్ట్ర ముఖ్య అధికారులు నోట్‌ను విడుదల చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఇకపై రోడ్ల మీద లేదంటే బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా తెలిసి లేదా తెలియకుండా గుట్కా పాన్‌ పరాక్‌ వంటివి ఉమ్మి వేస్తే వెంటనే వారిని గుర్తించి శిక్షించబడుతోంది.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంను పూర్తిగా నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది.

ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube