మందు బాబులపై కేసీఆర్‌కు ఎంత దయ?

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా మొన్నటి నుండి వైన్‌ షాప్‌లు తెరుచుకున్న విషయం తెల్సిందే.ఆర్థిక పరిస్థితి చాలా తీవ్ర గందరగోళంగా ఉన్న ఈ సమయంలో మద్యంకు రేటు పెంచడం తప్ప మరే మార్గం లేదు అంటూ పలు రాష్ట్రాలు మద్యంపై పెద్ద ఎత్తున రేటును పెంచడం జరిగింది.

 In Telangana Kcr Shows The Affection Of Liquor Drinkers Kcr, Telangana, Liquor D-TeluguStop.com

దిల్లీ 70 శాతం వరకు రేట్లు పెంచగా ఏపీ ప్రభుత్వం ఏకంగా 75 శాతం రేటు పెంచింది. వంద రూపాయలు ఉన్న బీరు రేటు ఏకంగా 175 రూపాయలకు చేరింది.

ఇంకా పలు ప్రాంతాల్లో రేట్లు పెంచారు.తెలంగాణలో కూడా మద్యం రేట్లు పెంచబోతున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.


ఇతర రాష్ట్రాల్లో పెంచినట్లుగా కాకుండా స్వల్పమొత్తంలోనే మద్యం రేట్లను పెంచినట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు.పేదలు తాగే బ్రాండ్స్‌పై 10 శాతం ఉన్నవాళ్లు తాగే బ్రాండ్స్‌పై 16 శాతం మాత్రమే అదనంగా వడ్డించినట్లుగా ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో మద్యం అమ్మకాలు నేటి నుండి షురూ అవుతున్నాయి.కేసీఆర్‌ నిర్ణయంతో మందు బాబులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రేటు పెంచినా తాగేందుకే మొగ్గు చూపుతారు.కనుక రేటు పెంచి పేద వారి పొట్ట కొట్టడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి కేసీఆర్‌కు మందుబాబులు అంటే ఎంత అభిమానం, దయ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube