రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టేస్తారా ? డిమాండ్ పెరుగుతోందిగా ?

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.కొద్దిరోజులుగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, దానికి బదులుగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి భూకబ్జాలు, ఇతర పెండింగ్ కేసులను తెరపైకి తీసుకువస్తూ హడావుడి చేసింది.

 In Telangana Huge Fans Following In Revanth Reddy He Start The New Party-TeluguStop.com

సరిగ్గా అదే సమయంలో టిఆర్ఎస్ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ ను రేవంత్ రెడ్డి అనుచరుల ద్వారా డ్రోన్ కెమెరా సహాయంతో ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలను వీడియో తీయడం వివాదాస్పదమైంది.ఈ వ్యవహారంలో రేవంత్ అనుచరులతో పాటు ఆయనపైనా కేసు నమోదు అయ్యింది.

అంతేకాకుండా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

మొదటి నుంచి చూస్తే టిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఏకుమేకులా వ్యవహరిస్తూ వస్తున్నారు.

కెసిఆర్, కేటీఆర్ ను రాజకీయ పరంగా, వ్యక్తిగతంగానూ విమర్శలు చేయడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందుంటున్నారు.ఆయన తెలుగుదేశంలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, టిఆర్ఎస్ పై ఇదే విధంగా వ్యవహారం ఉంటూ వస్తోంది ప్రస్తుతం.

అసలే ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా రేవంత్ కనిపిస్తున్నారు.రేవంత్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో మారే నాయకుడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి అధిష్టానం రేవంత్ కు ఇస్తారని చాలామంది ఊహించినా, అధిష్టానం మాత్రం నాంచివేత ధోరణి అవలంబిస్తోంది.

Telugu Congress Tdp, Start, Telanganafans, Revanth, Revanth Reddy, Telanaganatrs

టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయబ్రాంతులకు గురి చేసినా రేవంత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడడం లేదు.ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతంత మాత్రంగానే స్పందన ఉంది.దీంతో కాంగ్రెస్ లో ఆయన ఉండేకంటే సొంతంగా పార్టీ పెడితే ఆయనకు మరింత క్రేజ్ పెరుగుతుందని టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులంతా రేవంత్ పార్టీ పెడితే అందులో వచ్చి చేరుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏ పార్టీ కనిపించకపవడంతో, ఆ పార్టీ హవా ఎక్కువగా కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడితేనే మంచిదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube