కష్టాల కాంగ్రెస్ : తెలుగు రాష్ట్రాల్లో కోలుకునే ఛాన్స్ లేదా ...?

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన బలం ఏంటో నిరూపించుకుంది.కానీ… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా కనిపిస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి కాంగ్రెస్ ఏపీ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది.

 In Telangana And Andhra Pradesh Congress In Deep Trouble-TeluguStop.com

ఇక్కడ దాదాపు ఇంకో పదేళ్లలో అయినా కాంగ్రెస్ కోలుకుంటుందా అనే పరిస్థితి ఉంది ఇక్కడ.అలా అని తెలంగాణాలో ఏమైనా బలం పుంజుకుందా అంటే అదీ లేదు.

గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి గడ్డుకాలమే ఎదురయ్యింది.టీడీపీతో పొత్తు… టీఆర్ఎస్ బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం… నామినేషన్ల గడువు వరకు అభ్యర్థులను తేల్చకపోవడం ఇలా కారణాలు ఏవైనా కావచ్చు కానీ… కాంగ్రెస్ మాత్రం కోలుకొని విధంగా దెబ్బతింది అనేది వాస్తవం.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు నిరాశా … నిస్పృహల్లో ఉంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ కి గురైన కాంగ్రెస్ నేతలు ఇంకా తేరుకోలేదు.పార్టీ అధిష్ఠానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేసినా ఫలితాలు దారుణంగా ఉండటం ఉద్దండులుగా భావించిన సీనియర్ నేతలు సైతం ఓడిపోవడంతో నాయకులు చాలా నిరాశ చెందుతున్నారు.పార్టీకి సీనియర్ నాయకులుగా పెద్ద దిక్కుగా ఉన్నవారంతా ఓటమిపాలవ్వడంతో… సైరైనా దిశా నిర్దేశం చేసే వారు కరువయ్యారు.

మరోపక్క చూస్తే… పంచాయితీ ఎన్నికలు కూడా ముంచుకొచ్చేస్తున్నాయి.ఇప్పటికే గెలుపు జోష్ లో ఉన్న టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లిన్ స్వీప్ చేయాలనీ చూస్తోంది.

కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఆ కసి మాత్రం కనిపించడం లేదు.

ఇక ఇక్కడ పార్టీ ఓడినా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు….ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అప్పుడే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి.ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే… ఇక్కడ అడ్రస్ గల్లంతు అయినట్టుగానే కనిపిస్తోంది.

తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఏపీ కాంగ్రెస్ హడావుడి చేసింది.పార్టీని వీడి వెళ్ళిపోయినా కెలక నాయకులందరినీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు కొంతమంది చేరినా … కొత్తగా ఆ పార్టీలో కలిసొచ్చిన అంశాలేవీ కనిపించలేదు.ఇక ఏపీలో టీడీపీ జత కలుస్తుంది ఎన్నో కొన్ని సీట్లలో గెలుస్తాము అనే ధీమాలో ఉన్న కాంగ్రెస్ కి తెలంగాణాలో ఆ పొత్తు చిత్తు అవ్వడం… ఏపీలో టీడీపీ -కాంగ్రెస్ పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.

ఇక సొంతంగా ఎన్నికల బరిలోకి వెల్దామంటే …తెలంగాణాలో బీజేపీయే కి పట్టిన దుస్థితే ఏపీలో కాంగ్రెస్ కి వస్తుంది అన్న అనుమానం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube