ఆ కంపెనీల్లో ఆడవారికి నరకం.. 'ఆ' సమయంలో కూడా వదలరు, మూత్రంకు వెళ్లనివ్వరు

పని ఏదైనా, జీతం ఎంత ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటే పని చేయవచ్చు.కాని రోజంతా పని చేయాల్సిందే అని, కనీసం మూత్రంకు కూడా వెళ్లకుండా చేయాలని, మూత్రంకు అయిదు నిమిషాల కంటే ఎక్కువ వెళ్తే వివరణ ఇవ్వడంతో పాటు అందరి ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి ఉంటుంది.

 In Spinning Mills Of Tamil Nadu Women Facing Problems-TeluguStop.com

ఇక ఒకవేళ వివరణకు సంతృప్తి చెందకుంటే వారి జీతం నుండి గంటకు ఎంత అయితే పడుతుందో అంత జీతంను కట్‌ చేయడం జరుగుతుంది.ఇక ఆడవారు రుతుక్రమం సమయంలో కూడా రోజంతా నిలబడి చేయాల్సిందే.

ఒకటి రెండు రోజులు సెలవు కావాలి అంటే ఉద్యోగం ఉండదు.ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ కోరియాలోనే ఉందనుకుంటే పొరపాటే.

ఇది మన పక్క రాష్ట్రం తమిళనాడు వస్త్ర పరిశ్రమల్లో ఉంది.

తమిళనాడులోని పెద్ద ఎత్తున వస్త్ర పరిశ్రమల్లో సర్వే చేసిన థామ్సన్‌ రాయటర్స్‌ ఫౌండేషన్‌ వారు ఈ ఘోర విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు.

ఎంతో మంది ఈ విషయాలపై చాలా రోజులుగా మాట్లాడుతున్నా కూడా అక్కడి యాజమాన్యాలు వారి నోళ్లు మూయిస్తూ వచ్చింది.ఇప్పుడు ఈ ఫౌండేషన్‌ వెలుగులోకి తీసుకు వచ్చిన నిజాలు ఆ కంపెనీల యాజమాన్యాలు చేస్తున్న దారుణాలతో వణికి పోయేలా చేస్తున్నాయి.

ముఖ్యంగా ఆడవారి విషయంలో సదరు కంపెనీల వారు వ్యవహరిస్తున్న తీరుపై దేశ వ్యాప్తంగా మహిళ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ కంపెనీల్లో ఆడవారికి నరకం 'ఆ'

రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పికి యాజమాన్యాలు పెయిన్‌ కిల్లర్స్‌ ఇవ్వడంతో పాటు, వారు ఎక్కువ సేపు నిలబడి పని చేసిన సమయంలో కళ్లు తిరిగి పడిపోకుండా ఉండేలా బీపీ ట్యాబ్లెట్లు ఇస్తారు.వాటిని మింగి అలాగే పని చేయాలి తప్ప ఎక్కువ సమయం బయటకు వెళ్లడం, కొద్ది సేపు కూర్చోవడం లేదంటే సెలవు తీసుకోవడం వంటివి చేస్తే ఉద్యోగం ఉండదు.ఇలాంటి దారుణమైన రూల్స్‌ ఉన్నాయంటూ ఆ ఫౌండేషన్‌ వారు వెలుగులోకి తీసుకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చట్టపరమైన కార్మీక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యింది.

ఇకపై అయినా అక్కడ ఆడవారికి కాస్త రిలాక్స్‌ లభిస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube