శాకుంతలంలో దుష్యంతుడు ఎవరో క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్!

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నటి సమంత గురించి అందరికీ తెలిసిందే.

వయసు పెరుగుతున్న కొద్దీ తన అందాన్ని మరింత పెంచుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి తర్వాత మరింత ఆఫర్లను దక్కించుకోగా ప్రస్తుతం "శాకుంతలం" లో నటించనుంది.

తెలుగు సినీ పరిశ్రమ లో గుణశేఖర్ దర్శకత్వం గురించి అందరికి తెలిసిందే.ఆయన చారిత్రక, పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహించడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు.

అంతే కాకుండా ఆయన నటి అనుష్కతో తీసిన రుద్రమదేవి సినిమా విజయం గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా నందమూరి తారక తో చేసిన బాల రామాయణం నుంచి రుద్రమదేవి దాకా పౌరాణిక చిత్రాలలో మంచి విజయాన్ని సాధించిన గుణశేఖర్ మరో సినిమా శాకుంతలం టైటిల్ తో అందరినీ ఆకట్టుకునేలా చేసాడు.

కాగా గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తర్వాత హీరో రానా తో "హిరణ్యకశిప" సినిమా మొదలు పెట్టాలని అనుకోగా.ఈ సినిమాకు కాస్త సమయం పడుతుండటంతో శాకుంతల సినిమాను పరిచయం చేయాలనుకున్నాడు.

Advertisement

కాగా దీన్ని మహాభారతం లోని ఆది పర్వం నుంచి తీసుకున్నాడు.ఇందులో శకుంతల గా సమంత ను నిర్ణయించగా.

‌.దుష్యంతుడి గా ఎవరు నటిస్తున్నారని అభిమానుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో సంగీతం మణిశర్మ అందించనున్నాడు.

కాగా ఈ సినిమాలో సమంత సరసన నటించే హీరో రానా అని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ గుణశేఖర్ ఈ సినిమా గురించి వస్తున్న వదంతులపై స్పందించగా.ఈ సినిమాల్లో నటీనటుల పాత్రలు తప్ప మిగతా పాత్రల కోసం ఎంపిక చేస్తున్నామని తెలిపారు.కాగా ఈ సమయంలో దుష్యంతుని పాత్ర లో నటించే నటుడు గురించి ఎటువంటి ప్రచారాలు చేయొద్దు అని తెలిపారు.

పుష్ప ది రూల్ బీహార్ ఈవెంట్ పై విమర్శలు చేసిన సిద్దార్థ్.. ఏకంగా ఇంత జరిగిందా?
Advertisement

తాజా వార్తలు