ఇదేందయ్యా ఇది: పరీక్షలలో కాపీ కొట్టడానికి ఏకంగా చెప్పుల్లో..?!

రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం జరిగిన పరీక్షల్లో ఎవరు ఊహించని రీతిలో సినిమాలో చూపించే మాదిరిగా హైటెక్ కాపీ విధానం ఒకటి బయటపడింది.టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంతోషించాలో లేక అదే టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది రాంగ్ రూట్ లో అక్రమాలకు పాల్పడుతున్నారని విచారణ వ్యక్తం చేయాలో అర్ధం కావడం లేదు.

 In Sandals To Copy Exams-TeluguStop.com

స్టూడెంట్స్ తప్పు చేస్తే మందలించాలిసిన ఉపాధ్యాయులే ఇలా కాపీ కొట్టి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే ఇంకా మన సమాజం ఎలా బాగుపడుతుంది చెప్పండి.ఇప్పటివరకు మనం బ్లూటూత్ ను ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, పాటలు వినడానికి మాత్రమే ఉపయోగించుకుంటామని తెలుసు.

కానీ ఎగ్జామ్స్ లో ఇలా బ్లూటూత్ ఉపయోగించి కాపీ కూడా కొట్టవచ్చనే విషయాన్నీ ఈ టీచర్స్ నిరూపించారు.ఎవరికీ అనుమానం రాకుండా ఈ బ్లూటూత్‌ పరికరాలను తాము వేసుకున్న చెప్పుల్లో అమర్చుకుని ఏకంగా పరీక్ష రాయడానికి వచ్చి పోలీసులకు దొరికిపోయారు ముగ్గురు ఉపాధ్యాయులు.

 In Sandals To Copy Exams-ఇదేందయ్యా ఇది: పరీక్షలలో కాపీ కొట్టడానికి ఏకంగా చెప్పుల్లో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలో దాదాపు మూడేళ్ల తర్వాత 31 వేల టీచర్‌ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయగా.

దాదాపు ఆ పోస్టులకు 16 లక్షల మంది పోటీ పడుతున్నారు.ఈ క్రమంలోనే అభ్యర్థులకు రాజస్థాన్ అర్హత పరీక్షను (ఆర్‌ఇఇటి) ఆదివారం రోజున నిర్వహించారు.మొదట అజ్మీర్‌ లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానం వచ్చిన ఓ అభ్యర్థిని తనిఖీ చేయగా అతడు ధరించిన చెప్పులు చూసి పోలీసులు షాక్ అయ్యారు.చెప్పుల లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ ను అమర్చి, చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్‌ ఉన్నట్లు చెప్పారు.

పరీక్ష కేంద్రం బయట ఉన్న కొందరు వ్యక్తులు పరీక్ష రాసే అతనికి సమాధానాలు చేరవేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు.

ఈ ఘటనతో అధికారులు అన్ని పరీక్ష కేంద్రాలను అలెర్ట్ చేశారు.కాగా బికనెర్, సికార్‌ పట్టణాల్లో కూడా ఇలాంటి ఉదంతాలే బయటపడ్డాయి.ఇలా ఈ మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురును అరెస్టు చేసినట్లు బికనీర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ ప్రీతి చంద్ర తెలిపారు.అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు ఈ చెప్పులను రూ.6లక్షల పెట్టి కొనుగోలు చేసినట్లు తెలిపారు.చెప్పులను అమ్ముతున్న ముఠా వివరాలను రాబట్టి వారిపై దాడి చేయగా ఇద్దరు మాత్రమే దొరికారు.ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.రాజస్థాన్‌లోని దాదాపు 4,000 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ ఘటనతో అన్ని కేంద్రాలను అప్రమత్తం చేసారు అధికారులు.‘రీట్‌’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు.ఆదివారం రీట్‌ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ సేవలను 12 గంటలపాటు నిలిపివేయడం జరిగింది.

#Reet #Bluetooth #Mass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు