'ఆర్ఆర్‌ఆర్‌' లో ఆలియా ఆసక్తికర విషయం, ఆమె ఫ్యాన్స్‌ ఫిదా ఖాయం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.షూటింగ్ ను వచ్చే నెలలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 In Rrr Movie Alia Bhutt Doing Big Action Seance , Alia ,ntr ,rajamouli, Ram Char-TeluguStop.com

దర్శకుడు రాజమౌళి ఈ సినిమా లోని సీత పాత్ర కోసం ఎంతో మంది ముద్దు గుమ్మలను సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ సినిమా హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేయడం జరిగింది.సినిమా లోని ఒక కీలక పాత్రలో సీత పాత్ర అందంగా కనిపించడంతో పాటు ఫైట్‌ కూడా చేయాల్సి ఉంటుందట.

ఆ సన్నివేశంను దర్శకుడు అద్బుతంగా చిత్రీకరించాడని అంటున్నారు.బాహుబలి సినిమాలో తమన్నా కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా ప్రభాస్ తో ఫైట్‌ చేసిన సీన్‌ లో ఆమె హైలైట్‌ గా కనిపిస్తుంది.

అందుకే ఈ సినిమా లో కూడా అలాంటి ఒక ఫైట్ ను పెట్టబోతున్నారు.

బాహుబలి మొదటి పార్ట్‌ లో తమన్నా యాక్షన్‌ సన్నివేశం రెండవ పార్ట్‌ లో అనుష్క యాక్షన్‌ సన్నివేశంను చూపించిన జక్కన్న రాజమౌళి ఈ సారి ఆలియా చేసిన ఫైట్‌ ను అత్యంత అద్బుతంగా చిత్రీకరించారట.

ఆలియా భట్ అందంతో పాటు ఆమె ప్రతిభ ఆ సీన్‌ లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.బ్రిటీష్‌ వారితో పోరాడే సీన్ అంటూ ప్రచారం జరుగుతోంది.అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుం ఆలియా మరియు చరణ్‌ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరి కొన్ని రోజుల్లోనే ఆలియా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి అవ్వబోతుంది.ఎన్టీఆర్‌ మరియు విదేశీ ముద్దుగుమ్మల కాంబో సీన్స్ కూడా సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయని అంటున్నారు.

 ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ దేశ వ్యాప్తంగా సినీ వర్గాల వారు ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube