మన దేశంలో ఉన్న రహదారులు అంటే అంతే. వాటిపై ఎవరైనా ఏదైనా వాహనం నడిపితే చాలు, వారు ఇక వెనుకా ముందు ఆలోచించాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రదేశంలోని రోడ్లపైనైనా అలవోకగా వాహనాన్ని నడుపుతారు. ఎందుకంటే మన దగ్గర రోడ్లు అలా ఉంటాయి మరి. ఇక ట్రాఫిక్ రూల్స్ మీరే వారు, నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారు, ఖరీదైన కార్లలో తిరిగే వారు, వర్షాకాలంలో చెరువుల్లా మారే రహదారులు, ఒకే బైక్‌పై 5 మంది కన్నా ఎక్కువగా వెళ్లే వారు.. ఇలా అనేక రకాలైన మంది మనకు మన రోడ్లపై తరచూ కనిపిస్తూనే ఉంటారు. వారిని చూస్తే నిజంగా కొన్ని సార్లు నవ్వు వస్తుంది. ఇప్పుడు మేం కింద ఇచ్చిన ఫొటోలు కూడా అలాంటివే. రహదారులపై కొందరు వ్యక్తులు వెళ్లినప్పుడు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తీసినవి. వాటిని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకోండి..! సరదాగా..!
1. టేక్ డైవర్షన్ అనే మాట చెప్పేందుకు రెండు బోర్డులా. కొంచెం అతి అయినట్టు లేదూ..!
2. నవ్వు వచ్చే మాటే ఇది. కానీ అందులో ముఖ్యమైన మెసేజ్ ఉంది కదా..!
3. చూస్తే ఏనుగు రైడ్‌కు వెళ్తున్నట్టు లేదూ.
4. రాంగ్ రూట్‌లో వెళ్లే వారికి ఇలాగే జరుగుతుంది మరి. చూసి వెళ్లాల్సింది.
5. చూస్తే ఆటో గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉందనుకుంటున్నారా ? అబ్బే కాదండీ. వెనుక బరువు వల్ల ముందుకు లేచింది. అంతే.
6. మరి చిన్న వాహనమాయె. అటు తల్లి, ఇటు భార్య ఇద్దరినీ అంటే కష్టం కదా. అందుకే ఈ ఏర్పాటు. బాగుంది కదా.
7. ఇతనెవరో ధూమ్ టైప్ స్టంట్ చేస్తున్నట్టున్నాడు. జాగ్రత్త రా నాయనా..!
8. ఇది ఆటో అనుకుంటున్నారు కదా, కాదు. స్కూటర్. అటోలా మారిందంతే.
9. పాపం ఏం చేస్తాడు, పెట్రోల్ రేట్లు రోజూ అంతకంతకూ పెరుగుతున్నాయి కదా, స్కూటర్‌ను అమ్మక తప్పదు.
10. ఇక కార్ల పవర్‌ను హార్స్ పవర్‌లో కాకుండా బుల్ (ఎద్దు) పవర్‌లో చెప్పాలనుకుంటా.
11. వారెవ్వా.. ఎక్కువ ఇటుకలను సైకిల్‌పై ఇలా తీసుకెళ్లవచ్చన్నమాట. వెరీ గుడ్.
12. ఒంటెకు ఫ్యుయల్ నింపడం ఏంటి ? అనుకుంటున్నారా ? కాదండీ, సరిగ్గా చూడండి, బండిపై ఉన్న డ్రమ్ముని. కనబడిందా ?
13. ఆవులకూ సిటీ బస్సు సౌకర్యం ఉండాల్సిందే ? ఏమంటారు ?
14. వీడిలాంటి వారు ఉండబట్టే సెల్ఫీలకు చెడ్డ పేరు వస్తుంది. యాక్సిడెంట్‌లో మనుషులు ఉంటే నీ పైత్యపు పని ఏంట్రా బాబూ !
15. ఈయనెవరో అతి జాగ్రత్త పరుడిలా ఉన్నాడు కదా. బస్సులో గొడుగు అవసరం లేదన్నా !
16. అవును మరి, కోతులు కూడా మనకు ఫ్రెండ్సే కదా ! అవి బైక్‌పై రావాల్సిందే !
17. ఈ ఆటో డ్రైవర్ ఎవరో అందులోనే రెస్టారెంట్ నడుపుతున్నాడని అనుకుంటున్నారు కదా, కాదు. వేరే హోటల్ యాడ్స్ అవి.
18. బాయ్స్‌కే తెలివి ఉంటుందా ? మాకు ఉండదా ? మేమూ ఇలా వెళ్లగలం, ఏమనుకుంటున్నారో !
19. అరే బాబూ జాగ్రత్తరా నాయనా. అది టూ వీలర్, ఫోర్ వీలర్ కాదు.
20. ఎస్, చివరకు ఆ మహిళ స్కేటింగ్ ఇలా నేర్చుకుంటుందన్నమాట.
21. అవును మరి, ఎంతటి ఖరీదైన కార్ అయినా సరే మన రోడ్లపై ట్రాఫిక్ జాంలో ఇరుక్కోవాల్సిందే.
22. అందుకే మరి, విదేశీ కార్లు మన రోడ్లపై సెట్ అవ్వవు అనేది. ఇప్పటికైనా అర్థం అయిందా ?
23. నాకు తెలిసి ఈ బోర్డును నా వైఫ్ పెట్టి ఉంటుంది, యాక్ట్ చేయడం మానేయాలట !
24. అంతే మరి, వర్షాకాలం వచ్చిందంటే మన రహదారులు చెరువులే. చూస్తే ఇదేదో నదీ ప్రవాహంలా ఉంది కదా.
25. అంతటి భారీ ట్రాఫిక్ జాం అయితే తప్ప, అంత మంచి ఫొటో దొరకలేదు మరి..!