తల్లి కర్కశత్వం,కుక్కలు ఈడ్చడం తో విషయం బయటకి  

Dogs Rescue Newborn From Drain In Haryana\'s Kaithal-

ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి ఒక పసి బిడ్డను కర్కశంగా మురికి కాలువలో పడేసింది ఒక కసాయి తల్లి.అప్పుడే పుట్టిన ఆడపిల్ల ను ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి, మురికి కాలువ లో పడేసిన తల్లి కర్కశత్వం అంతా కూడా అక్కడున్న సీసీ ఫుటేజ్ లలో రికార్డ్ అయ్యింది.హర్యానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.డోగ్రా గెట్ ప్రాంతంలోని ఒక మురిగికి కాలువలో అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా ప్లాస్టిక్ కవర్ చుట్టి మరి మురికి కాలువలో పడేసింది.

Dogs Rescue Newborn From Drain In Haryana\'s Kaithal- Telugu Viral News Dogs Rescue Newborn From Drain In Haryana\'s Kaithal--Dogs Rescue Newborn From Drain In Haryana's Kaithal-

అయితే మురికి కాలువలో పడ్డ పసికందును కుక్కలు ఈడ్చుకెళ్లడం తో జనాలు దృష్టి పడింది.కుక్కలు మొరుగుతూ ప్లాస్టిక్ కవర్ చుట్టూ చేరడం తో అటుగా వచ్చిన జనం అనుమానంతో చూడడం తో ఒక పసికందు ప్లాస్టిక్ కవర్ లో కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం పాపను ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఆరోగ్యం మెరుగుపడగానే పాపను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ చైల్డ్ రైట్స్‌కు (NCPCR) అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.

మరోపక్క సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే పాప తల్లిని గుర్తించే పనిలో పడినట్లు తెలుస్తుంది.