ఫిలిప్పీన్స్‌లో వెలుగుచూసిన మానవ అక్రమ రవాణా

ఫిలిప్పీన్స్‌లో వెలుగుచూసిన మానవ అక్రమ రవాణా కేసులో అమెరికా జాతీయురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జెన్నిఫర్ టాల్బెట్‌ అనే 43 ఏళ్ల మహిళ బుధవారం మనీలా అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే పుట్టిన శిశువును అపహరించి పిల్లాడిని దేశం దాటించేందుకు ప్రయత్నించింది.

 In Philip 43 Years Us Women Has Been Charged With Human Trafficking Jennifer Ta-TeluguStop.com

అయితే జెన్నిఫర్ ఆ బాబుకు సంబంధించిన బోర్డింగ్ పాస్‌తో పాటు ఇతర పత్రాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించలేదు.

Telugu Jennifer Talbot, Philippians, Telugu Ups-Telugu NRI

దీంతో ఆమెపై వారికి అనుమానం కలిగింది.వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిలిప్పీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ )అధికారులకు సమాచారం అందించారు.అప్పటికే శిశివు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో తమ బాబును కిడ్నాప్ చేసిన ఆగంతకురాలు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుందని చిన్న క్లూ సైతం ఇచ్చారు.

Telugu Jennifer Talbot, Philippians, Telugu Ups-Telugu NRI

దీంతో విమానాశ్రయంలో జెన్నిఫర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌బీఐ అధికారులు.ఆమె నుంచి శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు.కాగా.

అమెరికాలోని ఓహియోకు చెందిన జెన్నిఫర్‌ టాల్బెట్ మనీలాలో జరుగుతున్న ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌కు వచ్చింది.ఆమెపై వచ్చిన ఆరోపణలపై జెన్నిఫర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.

ఈ కేసులో ఆమె దోషిగా తేలితే, జైలు జీవితం తప్పదని ఎన్‌బీఐ అధికారులు తెలిపారు.ఆమె అరెస్ట్‌ను మనీలాలోని యూఎస్ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube