పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఆయన ఒక్కసారిగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి వరుస సినిమాలు చేస్తు ముందుకు కదులుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే తమిళం లో సూపర్ హిట్ అయిన వీరమ్ సినిమాని తెలుగు లో కాటమరాయుడు( Katamarayudu ) పేరుతో రీమేక్ చేశాడు.
ఇక ఈ సినిమాకి డాలీ( Dolly ) దర్శకత్వం వహించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందని అందరు అనుకున్నారు.కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు.
ఇక దానికి తోడుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా నటించడానికి ఒక స్టార్ హీరోని కూడా సంప్రదించినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.అయితే ఆ స్టార్ హీరో ఆ పాత్ర ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో అంటే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) విజయ్ అప్పటికే పెళ్లి చూపులు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు.ఇక దాంతో ఈ సినిమాలో తమ్ముడు పాత్ర( younger brother ) కోసం అతన్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది.
కానీ తను ఆ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను చేయను అని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఆయన ఈ పాత్ర రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్రలోకి అజయ్ ని తీసుకున్నారు.ఇక ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేదు.దాంతో ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది కొంతవరకు అయితే డ్యామేజ్ అయింది.
అయినప్పటికీ ఆయన ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ వచ్చాడు…
.