వామ్మో.. ఆకాశాన్నంటిన అరటిపండు రూ.3,300 !

సాధారణంగా మనకు అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు అరటి పండు.మామూలుగా దీని ధర డజను ఓ రూ.40 ఉంటుంది.దాన్ని కూడా మనం బేరం చేస్తాం.

 In North Korea Banana Cost Hiked By 3300 Rupees-TeluguStop.com

మారుతున్న సీజన్‌ బట్టి ధర ఓ పది రూపాయలు అటూ ఇటూగా ఉంటుంది.కానీ, ప్రస్తుతం అరటి పండ్లు ఆకాశాన్నంటాయి.

అరటి పండు డజను కొనాలంటే వేలలో ఖర్చు పెట్టాలి.అప్పుడే మనం ఆ పండు తినగలం.

 In North Korea Banana Cost Hiked By 3300 Rupees-వామ్మో.. ఆకాశాన్నంటిన అరటిపళ్ల ధర రూ.3,300 -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏం కంగారు పడకండి! ఇదేం మన దేశంలో కాదు.ఉత్తర కొరియాలో ఈ పరిస్థితి ఉంది.

ఇదే ఇంత రేటు ఉంటే.మరి పాలు, పప్పు, ఉప్పు, పిండి ధర ఎంతుంటుందో మరీ? దీన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఇలా నిత్యావసర వస్తువులు హఠాత్తుగా పెరిగిపోయిన సంగతిని అధికారికంగా ధ్రువీకంరిచారు.ఇక ఈ సంగతి విన్న అక్కడి జనం కాస్త తలనొప్పి పెరిగి కాఫీ తాగుదామనుకుంటే.కాఫీ పొడి కూడా రూ.5–7 వేల మధ్య ఉంది.ఈ దుస్థితికి అసలు కారణం కొవిడ్‌.

కరోనా నేపథ్యంలో ఉత్తర కొరియా బార్డర్లను మూసివేసిన సంగతి తెలిసిందే.దీంతో ఆ దేశానికి దిగుమతులు విపరీతంగా తగ్గాయి.

అక్కడ ఆహారం దొరకడానికి ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు.అంతేకాదు, గత సంవత్సరం ఇక్కడ భారీ వరదలు కూడా వచ్చాయి.

ఇది కూడా ఇలా నిత్యావసర వస్తువులు పెరగటాయినికి మరో ప్రధాన కారణం.పొరుగు దేశమైన చైనా నుంచి కూడా దిగుమతులు లేవు.

దీనివల్ల ఆహార కొరత ఏర్పడింది.

Telugu Banana, Covid, Kim Jong, North Korea-Latest News - Telugu

ధరలు ఇలా అమాంతం పెరిగిపోతే.దిగువ, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.ఎందుకంటే సులభంగా దొరికే అరటి పళ్లు.

ప్రస్తుతం వేలు పెడితే కానీ, దొరకడం లేదంటే, పరిస్థితిని మనం ఈజీగా అంచనా వేయవచ్చు.దీనివల్ల నియంత పాలనలో ఉన్న ఉత్తర కొరియా ప్రజలు దుస్థితి అంతా ఇంతా కాదు.

వేలు పెట్టి కొనలేని ప్రజలు దయనీయ జీవనాన్ని అనుభవిస్తున్నారు.ఈ విషయాన్ని ఉత్తర కొరియా స్థానిక మీడియాలు కూడా ఇవే చెబుతున్నాయి.ఇక డజను అరటి పళ్లు రూ.3,300 ఉంటే కాఫీ ప్యాకెట్‌ రూ.7,300, టీ ధర రూ.5200.టీ, కాఫీల్లో వేసే పదార్థాలను ఇంత పెట్టి కొనాలంటే.ఇక టీ మొత్తం తయారీ ఖర్చు గ్యాస్‌ ధరతో కలిసి ఎంతవుతుందో? ఏది ఏమైనా ఉత్తర కొరియా ప్రజలు త్వరగా ఈ స్థితి నుంచి బయటపడాలని ఆ దేవుడిని కోరుకోవడం తప్ప మనం చేసేదేముంది.

#Banana #Kim Jong #North Korea #COvid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు