నాని బర్త్‌ డే సందర్బంగా మూడు సర్‌ ప్రైజ్‌లు రెడీగా ఉన్నాయి

యంగ్‌ హీరో నాని ప్రస్తుతం టక్ జగదీష్‌ చిత్రాన్ని పూర్తి చేయడంతో పాటు శ్యామ్‌ సింగరాయ్‌ మరియు అంటే సుందరానికి అనే సినిమాల్లో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 In Nani Birthday Comes In Three Suprises,nani, Nani Birthday, Shyam Singaroy, Tu-TeluguStop.com

మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకంతో మేకర్స్ మరియు నాని ఫ్యాన్స్ ఉన్నారు.ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న ఈ మూడు సినిమాలకు అప్‌ డేట్‌ లను పుట్టిన రోజు సందర్బంగా ఈనెల 24న ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ముఖ్యంగా శ్యామ్‌ సింగరాయ్ కోసం ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు.ఎందుకంటే నాని మొదటి సారి ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఆ సినిమా ఏంటీ కథ ఏంటీ అనే విషయమై సస్పెన్స్ గా కొనసాగుతూ వస్తుంది.ఫస్ట్ లుక్ విడుదల అయితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నాని హీరోగా రూపొందుతున్న శ్యామ్‌ సింగరాయ సినిమా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయబోతున్నారు.మరో వైపు టక్‌ జగదీష్‌ టీజర్ ను కూడా నాని బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న అంటే సుందరానికి సినిమా నుండి కూడా అప్ డేట్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.ఇప్పటికే సినిమా షూటింగ్‌ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

కనుక విడుదల తేదీ విషయంలో అంటే సుందరానికి యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇస్తారని నాని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.ఈమూడు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో విడుదల చేయాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు.

నాని పుట్టిన రోజుతో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube