నా దృష్టిలో లెజెండ్ అంటే జగపతి బాబే.. కోట కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 In My View The Legend Is Jagapathi Babu Kota Comments Viral-TeluguStop.com

చాలా వరకు హీరోగా నటించిన జగపతిబాబు ఈమధ్య విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు.అయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.కెరీర్ మొదట్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేశాడు.

తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

 In My View The Legend Is Jagapathi Babu Kota Comments Viral-నా దృష్టిలో లెజెండ్ అంటే జగపతి బాబే.. కోట కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అలా కొంతకాలం తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ తో అడుగు పెట్టి కొత్తకొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హీరోగా కంటే ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ పాత్రలలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇక జగపతి బాబుకు ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా అభిమానులుగా ఉన్నారు.ఈయనతో నటించిన చాలామంది నటీనటులు ఈయన గురించి ఎంతో అద్భుతంగా చెబుతుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా జగపతిబాబు గురించి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా కొన్ని కామెంట్లు చేశాడు.కోట శ్రీనివాసరావు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈయన చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించాడు.అంతేకాకుండా జగపతిబాబు సినిమాలో కూడా నటించాడు.

Telugu Actor, Comment, Jagapathi Babu, Kota Srinivasa Rao, Legend, Tollywood-Movie

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జగపతి బాబు గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తనకు లెజెండ్ సినిమా గుర్తు వచ్చిన ప్రతిసారి జగపతి బాబు గుర్తుకు వస్తాడని అతడు చాలా కమిటెడ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు.ఆయన చిన్న పాత్ర నుంచి ఎటువంటి వేషం ఇచ్చినా సరే తనలో తాను మదన పడతాడని అన్నాడు.

Telugu Actor, Comment, Jagapathi Babu, Kota Srinivasa Rao, Legend, Tollywood-Movie

హీరో నుండి విలన్ గా మారటం లో డేరింగ్ స్టెప్ వేసాడని, విలన్ కూడా ఎంతో బాగా చేస్తున్నాడని బల్ల గుద్ది చెప్పగలను అంటూ తెలిపాడు.జగపతి బాబు తనకు హీరోగా ఎంత పేరు వచ్చిందో విలన్ గా కూడా మంచి పేరు వచ్చిందని తెలిపాడని అన్నాడు.ఇక జగపతిబాబును విలన్ గా ఎందుకు ఎంకరేజ్ చేయటంలేదని ప్రశ్నించాడు.ఎందుకు అతడు ఏమైనా తక్కువ ఆర్టిస్టా.

ఆయనకు విలన్ గా సెట్ అవ్వదా? ఒకవేళ ఫేస్ వాల్యూ కూడా తెలీదా ఇంతకీ ఆయనలో ఏం తక్కువ అని ప్రశ్నించాడు.జగపతి బాబు తన అబ్బాయి విషయంలో కూడా చాలా ముందుకు వచ్చాడని అన్నాడు.

ఇక తన కొడుకు సినిమాలలో నటించడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందించారని తెలిపాడు.ఓ రోజు తన అబ్బాయి విషయంలో జగపతిబాబు చేసిన అరేంజ్మెంట్స్ చూసి తన మనసు ఇబ్బంది పడిందని తెలిపాడు కోట.

#Legend #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube