నా ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు ఎంతో గొప్పవి.. దుల్కర్ వల్లే ఇదంతా: అనుపమ

In My Six Years Life That 58 Days Is The Greatest All This By Dulquer Says Anupama

కొందరికి తమ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అద్భుతమైన రోజులు అనేవి ఉంటాయి.ఎప్పటికీ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటూనే ఉంటారు.

 In My Six Years Life That 58 Days Is The Greatest All This By Dulquer Says Anupama-TeluguStop.com

రోజులు అనేవి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి.కానీ హీరోయిన్ అనుపమకు ఏకంగా 58 రోజులు ఎంతో అద్భుతమైన రోజులట.

తన ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు చాలా గొప్పగా గడిచాయని తెలిపింది.ఇంతకు ఆ 58 రోజులు ఏం జరిగిందో తెలుసుకుందాం.

 In My Six Years Life That 58 Days Is The Greatest All This By Dulquer Says Anupama-నా ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు ఎంతో గొప్పవి.. దుల్కర్ వల్లే ఇదంతా: అనుపమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో కుర్రాళ్ళ మనసులను దోచుకున్న నటి అనుపమ.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక తన నటనతో కూడా మంచి పేరు సంపాదించుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

ఇక సోషల్ మీడియాలో అనుపమ బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరో నితిన్ నటించిన అఆ సినిమాతో పరిచయమయ్యింది.

అంతకుముందే 2015లో ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.అప్పుడే తమిళ ఇండస్ట్రీలో కూడా పరిచయం అయింది.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu @dulquer, Pages, Dulquer Salman, Nikhil, Queens Show, Tollywood-Movie

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.ఇక తనకు శతమానం భవతి సినిమా మాత్రం మంచి సక్సెస్ అందించింది.అలా ఉన్నది జిందగి ఒకటే, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ ను అందించాయి.

ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే గతంలో అనుపమ హీరోయిన్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిందట.

Telugu @dulquer, Pages, Dulquer Salman, Nikhil, Queens Show, Tollywood-Movie

ఈ విషయాన్ని చాలాసార్లు పంచుకోగా తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూపర్ క్వీన్స్ అనే షో లో పాల్గొని తెలిపింది.అందులో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ.దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందట.

ఈ సినిమాకు షంజూ జేబా అనే టాలెంటెడ్ దర్శకుడు తొలిసారిగా పరిచయం అయ్యాడు.

అయితే ఈ సినిమాతో తాను తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎంతో ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యానని తెలిపింది.అలా 58 రోజులు ఆ షూటింగ్ లో పని చేశానని తెలిపింది.

Telugu @dulquer, Pages, Dulquer Salman, Nikhil, Queens Show, Tollywood-Movie

అలా తన ఆరేళ్ల జీవితంలో 58 రోజులు ఎంతో గొప్పవని పంచుకుంది.ఇదంతా దుల్కర్ వల్లే జరిగిందని తెలిపింది.ఇక తను కేరవాన్ దగ్గర హీరోయిన్ కోసం చాలా సేపు వెయిట్ చేసి ఆ హీరోయిన్ ని షాట్ కోసం తీసుకొని వచ్చానని తెలిపింది.ఇక అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని బాగా బిజీగా ఉంది.

అంతేకాకుండా హీరో నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Pages #@dulQuer #Dulquer Salman #Queens #Nikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube