రాంగ్ రూట్ లో వెళుతున్న బస్సు డ్రైవర్, స్కూటీ అడ్డంపెట్టిన మహిళ

దేశంలో ఎన్ని వాహన చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ వాహనదారుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు.రోడ్డు మీదకు వెళ్ళడానికి భయపడే చట్టాలు తీసుకువచ్చినా కొందరు ఆ చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు.

 In Kerala Woman On Scooty Makes Bus Driver Take Right Lane-TeluguStop.com

ఈ క్రమంలో రాంగ్ రూట్స్ లో వాహనాలను నడిపించడం,సిగ్నల్ ని బ్రేక్ చేసి రయ్ మని వెళ్లిపోవడం ఇలా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నప్పటికీ అక్కడే ఉండే జనాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా పక్కకు తప్పుకొని పోతుంటారు.

అయితే కొందరు మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎవరికైనా నష్టం కలుగుతుంది అన్న సామజిక స్పృహ తో వ్యవహరిస్తూ ఉంటారు.అలాంటి సామజిక స్పృహ తోనే ఒక మహిళ ప్రవర్తించిన తీరు కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే… కేరళ లోని ఒక ప్రాంతంలో ఒక బస్సు డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి రాంగ్ రూట్లో బస్సును డ్రైవ్ చేస్తున్నాడు.ఎడమవైపు లైన్ లో వెళ్లాల్సిన బస్సును ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం తో కుడి వైపు లైన్ లోకి తీసుకెళ్లి మరీ డ్రైవ్ చేస్తున్నాడు.

దీనితో కుడివైపు లైన్ లో వెళ్లే వాహనదారులు నా నా ఇబ్బంది పడుతున్నారు.అయితే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎవరూ కూడా ఆ బస్సు డ్రైవర్ ను ప్రశ్నించలేదు సరికదా పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోతున్నారు.

అయితే అప్పుడే ఒక మహిళ ఒక చిన్న స్కూటీ పై సివంగి లా వచ్చి బస్సుకు అడ్డంగా తమ స్కూటీ ని పెట్టి ఏమాత్రం నదురు బెదురూ లేకుండా అలానే నిలుచుంది.దీనితో ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక ఆ బస్సు డ్రైవర్ ఖంగుతిని వెంటనే తన బస్సు ను ఎడమవైపు లైన్ లోకి తీసుకువెళ్లాడు.

Telugu Scooty Bus Lane, Telugu Ups, Root Buss-Inspirational Storys

అయితే ఇదంతాకూడా అక్కడ ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ మహిళ చేసిన పనికి తెగ ప్రసంశలు కురిపిస్తున్నారు.ఆ మహిళ ధైర్యాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చూసి నెటిజన్లు లేడీ సింగం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube