దాదాపు పది రోజుల పాటు లాక్ డౌన్ లోకి ఆ రాష్ట్రం..??

దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.వారం రోజుల వ్యవధిలో 70 శాతానికి పైగా కొత్త కేసుల సంఖ్య పెరిగిపోవటం మాత్రమే కాక లక్షల్లో నమోదు అవుతున్నాయి.

 In Karnataka Complete Lock Down-TeluguStop.com

దీంతో ఇప్పటికే ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.అంతేకాకుండా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా వీలైనంత స్పీడ్ గా చేయాలని పిలుపునిచ్చారు.

పరిస్థితి ఇలా ఉండగా కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తూ లాక్ డౌన్ అమలు అయ్యే పరిస్థితి నెలకొంది.ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో దాదాపు పది రోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేయడానికి యడ్యూరప్ప ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

 In Karnataka Complete Lock Down-దాదాపు పది రోజుల పాటు లాక్ డౌన్ లోకి ఆ రాష్ట్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్రంలో ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికల అయిపోయిన వెంటనే కర్ణాటకలో కంప్లీట్ లాక్‌డౌన్‌ ప్రకటన అక్కడి ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం.

#Karnataka #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు