భారత సైన్య ఘనత.. 60 గంటల్లో 120 అడుగుల వంతెన పూర్తి..!  

in just 60 hrs 120 feets bridge complete, border road organization, military, India, Jammu, Kashmir - Telugu Border Road Organization, India, Jammu, Kashmir, Military

తాజాగా భారతదేశ మిలిటరీకి సంబంధించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - In Just 60 Hrs 120 Feets Bridge Complete

జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై కేవలం 60 గంటల్లో 120 అడుగుల పొడవైన బెయిలీ వంతనేను పూర్తి చేసి రికార్డు సృష్టించారు.రాంబన్ సమీపంలోని కేలా మోర్ వద్ద ఈ వంతెనను నిర్మించింది బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్.

గత కొద్ది కాలం క్రితం ఈ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడడంతో దాదాపు వారం రోజుల నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.దీంతో కాశ్మీర్ లోయలో ఉన్న ప్రాంతాలకు దేశంలోని ఇతర ప్రాంతాలలో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.

TeluguStop.com - భారత సైన్య ఘనత.. 60 గంటల్లో 120 అడుగుల వంతెన పూర్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image

పరిస్థితి విషమించకముందే బెయిలీ వంతెనను నిర్మించారు.

ఈ వంతెన నిర్మాణం కోసం చిన్నపాటి ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ ఫలకాలను ఉపయోగించారు.

తాజాగా నిర్వహించిన ట్రైల్ రన్ విజయవంతం అయినట్టు అధికారులు తెలిపారు.దీంతో గత సాయంత్రం నుండి వాహన రాకపోకలను అనుమతించినట్లు అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగి పడడంతో, పెద్దపెద్ద గుంతలు ఏర్పడడం కారణంగా.రహదారిని పూర్తిగా మూసి వేయడంతో పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఆ ప్రాంత అధికారులు.

అయితే పరిస్థితిని శృతిమించకుండా కేవలం రెండు రోజుల్లోనే వంతెనను సిద్ధం చేస్తామని బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ తెలిపింది.

Telugu Border Road Organization, India, Jammu, Kashmir, Military-Latest News - Telugu

దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెనను నిర్మించి శనివారం మధ్యాహ్నం నాటికి ట్రైల్ రన్ పూర్తిచేసి సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఈ వంతెనను జనవరి 14 ఉదయం ఏడున్నర గంటల సమయంలో పనులను ప్రారంభించి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలలో పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు అధికారులు, పది మంది సూపర్వైజర్స్, 50 మంది వర్కర్లు అందరూ నిర్విరామంగా 60 గంటల పాటు శ్రమించి వంతెనను పూర్తిచేశారు.

#Military #Kashmir #BorderRoad #India #Jammu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు