బెంగళూరు జోరుకు పంజాబ్ కళ్లెం వేస్తుందా..?!

ఐపీఎల్ 13వ సీజన్ నేపథ్యంలో నేడు 6వ మ్యాచ్ దుబాయ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగబోతోంది.ఇక ఇదివరకు మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ తన మొదటి మ్యాచ్ లో హోరాహోరీగా సాగిన నేపథ్యంలో ఎట్టకేలకు విజయం సాధించగా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలిచే మ్యాచ్ ను చేజేతులా ప్రత్యర్థికి అప్పగించింది.

 Kings Xi Punjab Vs Royal Challengers Bangalore, Kings Xi Punjab , Royal Challeng-TeluguStop.com

దీంతో ఈ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారబోతోంది.

ఇక ఈ రెండు జట్ల విశేషాల్లోకి వస్తే… మొదటగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయం చూస్తే, టీంలో ఎంత మంది క్రికెటర్లు ఉన్న చివరికి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అలాగే మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ పైనే అన్ని సీజన్లలో బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు.

అయితే గత మ్యాచ్ లో మాత్రం యువ సంచలనం దేవదత్ పాడిక్కాల్ తన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచురీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.వీరితోపాటు ఆరోన్ ఫించ్ కూడా జత కావడంతో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా కనబడుతోంది.

దీంతో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది.ఇక మరోవైపు వీరి బౌలర్స్ విషయానికి వస్తే… డేల్ స్టెయిన్, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ఛాహల్, షైనీ లతో చాలా పటిష్టంగా కనబడుతోంది.

ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విషయానికి వస్తే… కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్ లో కాస్త నిరాశ పరిచాడు అని చెప్పవచ్చు.అయితే పంజాబ్ చెట్టులో కె.ఎల్.రాహుల్, యమాంక్ అగర్వాల్, గ్లెన్ మాక్స్ వెల్, నికోలస్ పూరన్ చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ ఉన్నారు.వీరందరూ వారికి తగ్గట్టు ఆట ఆడితే కచ్చితంగా ఆర్సిబి జట్టుకు విజయం కాస్త కష్టమే.ఇక వీరి బౌలింగ్ విభాగం చూస్తే.మహమ్మద్ షమీ, శత్రు దుర్భేద్య, కాట్రాల్, కృష్ణప్ప గౌతమ్ లతో సమతూకంగా కనబడుతోంది.చూడాలి మరి గత మ్యాచ్ లో గెలుపొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన విజయ జైత్రయాత్రను కొనసాగిస్తుందో లేదో…?!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube