అక్కడ సునామీ హెచ్చరికలు జారీ..వణికిపోతున్న ప్రపంచదేశాలు..!!

ఈరోజు ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఈ భూకంపం.దాటికి ఇండోనేషియా హడలెత్తి పోయింది.

 In Indonesia Earthquake And Tsunami Warns Indonesia, Earthquake, Tsunami-TeluguStop.com

దీంతో వెంటనే ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.దేశంలో మమ్మేరు పట్టణానికి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో ఫ్లోరెస్ సముద్రంలో 18.5 కిలో మీటర్ల అడుగున భూకంపం సంభవించినట్లు … ఇండోనేషియా శాస్త్రవేత్తలతో పాటు అమెరికా జియోలాజికల్ సర్వే కూడా నిర్ధారించింది.ఇక ఇదే సమయంలో భూకంపం సంభవించిన ఈ ప్రాంతానికి చుట్టుప్రక్కల దాదాపు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో కెరటాలు ఎగిసి పడే అవకాశం ఉందని.

పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కూడా తెలియజేయడంతో… ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telugu Earthquake, Indonesia, Tsunami-Latest News - Telugu

దీంతో భూకంపం సంభవించిన ప్రాంతాలలో… ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం చేరవేసే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రాణ నష్టం పెద్దగా ఉండదని కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇండోనేషియాలో ఎక్కువగా భూకంపాలు రావడానికి గల కారణం.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు.ఇప్పటివరకు 2004లో అదే రీతిలో 2018, సంవత్సరాలలో భారీ భూకంపాల తో పాటు సునామి రావడం జరిగింది.

2004వ సంవత్సరంలో ఇండోనేషియాలో వచ్చిన భూకంప తీవ్రత బట్టి ఏర్పడిన సునామీ.వలన దాదాపు రెండు లక్షలకు పైగానే ప్రజలు చనిపోయారు.

ఇదిలా ఉంటే ప్రస్తుత భూకంప తీవ్రత బట్టి వచ్చేస్తున్నాను పెద్ద ప్రమాదం లేదని.కంగారు పడాల్సిన అవసరం లేదని అమెరికా జియోలాజికల్ సర్వే నిర్ధారించడం జరిగింది.

 ఇదిలా ఉంటే గతంలో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం ధాటికి ఏర్పడిన సునామీ కారణంగా చాలామంది జనాలు చనిపోవడంతో ఇండోనేషియాలో భూకంప వార్త… ప్రపంచ దేశాలకు భయాందోళనలు కలిగిస్తోంది.ఎప్పుడు ఏమవుతుందో అన్న ఆందోళనలో… ఇండోనేషియా దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఫ్లోరెస్ సముద్ర తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.

 కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  సృష్టిస్తున్న బీభత్సం తోపాటు తాజా సునామీ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube