ఆ దేశంలో పెళ్లి చేసుకోవడానికి 10 మంది అమ్మాయిలకి ఒక్క అబ్బాయి మాత్రమే ఉన్నాడట....

ఈ మధ్యకాలంలో ఆడపిల్లల పోషణ మరియు వారి పెళ్లికి అయ్యేటువంటి ఖర్చులు, చదువులు ఇతరాత్ర విషయాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఆడపిల్లలను కనడానికి భయపడుతున్నారు. దీంతో ఇటీవలే ఓ సర్వేలో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలకు కరువు అవుతారని తేలింది.

 In Iceland Country Bride's Percentage More Than Groom, Iceland Country, Iceland-TeluguStop.com

కానీ ఆ దేశంలో మాత్రం మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువగా ఉండటంతో ఆ దేశపు ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ దేశపు పౌరసత్వం విషయంలో కొంత మేర సడలింపులు కూడా ఇస్తామంటూ ముందుకొచ్చారు.ఇప్పుడు అలాంటి దేశం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ప్రపంచంలో ఉన్నటువంటి అతి చిన్న మరియు సుందరమైన దేశాలలో ఐస్లాండ్ దేశం ఒకటి.అయితే 2019వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో జనాభా మూడు లక్షల అరవై వేల పైచిలుకు మంది ఉన్నారు.

 ఇందులో ఎక్కువగా పెళ్లి కావాల్సిన యువతులు దాదాపుగా లక్ష మందికి పైగా ఉన్నారు.అలాగే మగవాళ్లు కేవలం పదిహేను వేల పైచిలుకు మంది ఉన్నారట. దీంతో ఈ దేశంలో ఒక్క యువకుడికి పెళ్లి చేసుకునేందుకు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది యువతులు ఉన్నట్లు తేలింది.అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.

 ఈ దేశంలో ఆడవాళ్ళకి మగవాళ్ళతో పాటూ సరి సమాన హక్కులు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఈ దేశ రాజకీయాల్లో మరియు ఉద్యోగాల్లో అలాగే ఇతర సంబంధిత రంగాల్లో కూడా మగవాళ్ళకి సరిసమానంగా ఆడవాళ్లకి హక్కు ఉండటంతో ఇక్కడ ఆడ మగల కి పెద్దగా తేడా ఉండదు.

అందువల్లనే దంపతులు కూడా  ఆడ బిడ్డకి కే జన్మనిచ్చే విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండదు.

అయితే ఈ దేశం ఎక్కువగా పర్యాటకం ప్రాంతాలకి ప్రసిద్ధి గాంచింది.

ఇక ఈ దేశపు ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా చేపలతో చేసేటటువంటి వంటకాలకు మంచి గిరాకీ ఉంటుంది.కానీ ఈ దేశంలో పామ్ ఆయిల్ ని పూర్తిగా నిషేధించారు.

ఈ పామ్ ఆయిల్ ని తయారు చేసే క్రమంలో పర్యావరణానికి హాని కలుగుతుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందువల్లనే ఈ దేశంలో పూర్తిగా పామ్ ఆయిల్ ని తయారు చేయడం, కొనడం మరియు దిగుమతి చేసుకోవడం వంటివి  పూర్తిగా నిషేధించారు.

ఇక ఈ దేశపు కరెన్సీ విషయానికొస్తే మన రూపాయి కంటే ఐస్ లాండ్ క్రోనా దాదాపుగా 40 పైసలు తక్కువ ఉంటుంది.మీరు ఎప్పుడైనా పర్యాటక ప్రాంతాలను వెళ్లాలనుకుంటే ఐస్లాండ్ కి వెళ్ళవచ్చు.

 తక్కువ బడ్జెట్ లో అతి సుందరమైన సుందరవనాలు మరియు ఇతర చారిత్రక కట్టడాలు వంటివి చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube