బిలియనీర్లు కాదు.. సామాన్యులే వ్యోమగాములు, స్పేస్‌ఎక్స్ ప్రయోగానికి సర్వం సిద్ధం

అంతరిక్షంలో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధమైంది.టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్ మరికొద్దిగంటల్లో నింగిలోకి దూసుకుపోనుంది.అమెరికా ఫ్లోరిడాలోని కేప్‌ కానెర్వాల్‌లో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు రాత్రి స్థానిక కాలమానం ప్రకారం.8.02 (భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి 00.02) గంటలకు స్పేస్‌–ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగం జరగనుంది.స్పేస్‌–ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌–9 హెవీ రాకెట్‌..వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ను భూకక్ష్యలోకి తరలించనుంది.‘‘ఇన్‌స్పిరేషన్‌ 4’పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు.

 In First, Spacex To Send All-civilian Crew Into Earth Orbit Key Facts , Florida,-TeluguStop.com

ఈ ఏడాది జూలైలో వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాస్నన్, అమెజాన్‌ యజమాని జెఫ్‌ బెజోస్‌లు పోటాపోటీగా అంతరిక్ష పర్యటనలు చేయగా తాజాగా స్పేస్‌–ఎక్స్‌ యాత్ర మూడవది.

తొలి రెండు ప్రయోగాల్లో కోటీశ్వరులు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లే అంతరిక్షంలోకి వెళ్లారు.

కానీ స్పేస్‌–ఎక్స్‌ సిద్ధం చేసిన అంతరిక్ష ప్రయోగంలో మాత్రం సామాన్యులకూ చోటుదక్కింది.ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్‌–4’ పేమెంట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ సీఈవో జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ భరిస్తున్నారు.

ఆయన ఎంత మొత్తం స్పేస్‌–ఎక్స్‌కు చెల్లించారన్న విషయం స్పష్టంగా తెలియకున్నా ఇది రూ.వందల కోట్లలో ఉండొచ్చని అంచనా.

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్‌–ఎక్స్‌ వ్యోమగాముల ఎంపిక ప్రకటన చేసింది.ఆ తరువాత అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాల్లో వారికి శిక్షణ ఇచ్చింది.భారరహిత స్థితిని పరిచయం చేసేందుకు వ్యోమగాములను అర్ధచంద్రాకారం ఆకారంలో విమానంలో విప్పింది.ఇలా తిప్పినప్పుడు కొన్ని సెకన్లపాటు శరీరం బరువు మనకు తెలియదు.రోలర్‌ స్కేటర్‌లో ఎత్తు నుంచి కిందకు జారుతున్నప్పుడు కలిగే అనుభూతి అన్నమాట.

ఇన్‌స్పిరేషన్‌–4ను భూకేంద్రం నుంచే నియంత్రిస్తూంటారు.మూడు రోజుల అంతరిక్ష ప్రయాణం మొత్తమ్మీద వ్యోమగాముల నిద్ర, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో వచ్చే మార్పులు, మేధో సామర్థ్యం వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తారు.భవిష్యత్తులో సాధారణ పౌరులతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని అంచనా.

Telugu Alan Musk, Cape Canervall, Falconheavy, Florida, Haley Arseniaks, Isaacma

ఇక స్పేస్ ఎయిర్‌‌క్రాఫ్ట్ విషయానికి వస్తే.ఫాల్కన్ 9 రాకెట్‌‌కు పై భాగంలో 70 అడుగుల ఎత్తులో డ్రాగన్ క్యాప్సూల్ ఉంటుంది.అక్కడ వ్యోమగాములు కూర్చొంటారు.ఈ వ్యోమనౌక ఇప్పటికే 10 మంది వ్యోమగాములను మూడు వేర్వేరు మిషన్‌లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లింది.ఈ డ్రాగన్ క్యాప్సూల్‌ 8 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పు‌ వుంటుంది.ప్రయాణీకులు 360 డిగ్రీల కోణంలో వీక్షించడానికి భారీ గాజు గాపురం అమర్చారు.

అమెరికాకు చెందిన పైలెట్‌, షిప్ట్‌ 4 పేమెంట్‌ సంస్థ అధినేత ఐజాక్మన్, సియాన్ ప్రొక్టర్, హేలీ ఆర్సెనియాక్స్, క్రిస్టోఫర్ సెంబ్రోస్కీలు స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో ప్రయాణించనున్నారు.సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ క్యాన్సర్‌ రీసెర్చ్ హాస్పిటల్ ఫండింగ్‌ కోసమే ఈ ప్రయోగం చేపట్టినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube