ఫిబ్రవరిలో రిలీజ్ ఎంత వరకు సేఫ్‌.. కోవిడ్‌ భయం ఉంటుందా? లేదా?

కరోనా మొదటి వేవ్ సమయంలో దాదాపుగా నాలుగు అయిదు నెలల పాటు థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి.సెకండ్‌ వేవ్‌ సమయంలో రెండు మూడు నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి.

 In February Movie Theaters Are Going To Open And Movies Release , Covid -19 , Movie Theaters , Movies, Theaters, Tollywood-TeluguStop.com

అయితే థర్డ్‌ వేవ్‌ సమయంలో థియేటర్లు మూత పడలేదు.కాని ఆంక్షలు తప్పలేదు.

తెలంగాణ లో అయితే పూర్తి స్థాయి లో నే థియేటర్లు నడిచాయి.కాని ఏపీలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీ అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తో సినిమా థియేటర్లు నడిచాయి.జనవరి లో భారీ సినిమా ల విడుదల ఉండే.

కాని కరోనా థర్డ్‌ వేవ్‌ కు భయపడి సినిమా థియేటర్ల లోకి ఆ సినిమా లు వచ్చేందుకు భయ పడ్డాయి.కాని థర్డ్‌ వేవ్‌ ఆ స్థాయి లో ప్రభావంను చూపించలేదు.

లక్ష ల్లో కేసులు నమోదు అవుతాయని అన్నారు.రోజుకు పది నుండి ఇరవై ముప్పై లక్షల కేసులు అన్నారు.

కాని నాలుగు అయిదు లక్షల వరకు నమోదు అయ్యి మళ్ల తగ్గుముఖం పట్టాయి.పెద్ద ఎత్తున కేసుల సంఖ్య పెరగడం చర్చనీయాంశం అయ్యింది.

Telugu Covid, Theaters, Tollywood-Movie

అయితే ఆ పెరిగిన కేసుల ప్రభావం కూడా తక్కువే ఉంది.కనుక ఉత్తరాది రాష్ట్రాల్లో థర్డ్‌ వేవ్‌ ప్రభావం తగ్గడంతో థియేటర్ల వద్ద ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నారు.దాంతో ఫిబ్రవరిలో సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఫిబ్రవరి లో ఇంకా కరోనా కేసులు ఉంటాయి.భయం కూడా ఉంటుంది.అలాంటి సమయంలో సినిమా ల విడుదల ఎంత వరకు సబబు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వందల కోట్ల బడ్జెట్‌ సినిమా లకు ప్రమాదం కాని.చిన్న బడ్జెట్‌ సినిమా లకు అది పెద్ద ఇబ్బంది కర విషయం కాకపోవచ్చు అంటున్నారు.

అందుకే ఫిబ్రవరి మూడవ వారం నుండి థియేటర్ల వద్ద మళ్లీ కళ కళ చూడటం జరుగుతుంది.కోవిడ్‌ భయం కూడా ఉండదు.

ఇంతకు ముందు మాదిరిగా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా థియేటర్లకు జనాలు వెళ్లి సినిమా లను ఎంజాయ్‌ చేస్తారు.కనుక ఫిబ్రవరి లో భీమ్లా నాయక్‌ సినిమా విడుదల ఖాయం.

ఇంకా ఇతర సినిమా లు కూడా వస్తాయి.మార్చి లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదల కూడా ఖాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube