కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరుగబోతున్న విషయాలను చెప్పిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి.
బ్రహ్మంగారి కాల జ్ఞానం ఒక్కొక్కటిగా నిజం అవుతూ వస్తుంది.మనిషి చావును జయించడం నుండి సునామి రానుందంటూ చెప్పిన విషయాలన్ని కూడా నిజం అయ్యాయి.
ఇప్పుడు ఢిల్లీలో మరోసారి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజయం అయ్యింది.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి కాల జ్ఞానం ప్రకారం జరుగుతుంది.

ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అసలు ఢిల్లీ మనుషులు జీవించేందుకు అనుకూలం కాదు అంటూ వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు.మాస్క్ లేకుండా ఢిల్లీ వీధుల్లో ఒక్క రోజు తిరిగితే తీవ్ర అనారోగ్యం ఖాయం అంటూ వైధ్యులు కూడా సూచిస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీ మెల్ల మెల్లగా ఖాళీ అవుతుంది.
పరిస్థితులు మరింతగా ముదుకుండానే అక్కడ ఏమైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

ఈ సమయంలోనే ఢిల్లీలో స్వచ్చమైన గాలిని కొన్ని స్వచ్చంద సంస్థలు ఇవ్వడంతో పాటు, కొన్ని చోట్ల స్టాల్స్ మాదిరిగా పెట్టి అమ్ముతున్నారు.గాలిని కొనుగోలు చేసే పరిస్థితి రావడం మరీ దారుణం అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మనం చేసుకున్న పాపానికి మనమే శిక్ష అనుభవిస్తున్నాం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అన్ని కొంటారయ్యా.చివరకు గాలిని కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందయ్యా అంటూ చెప్పాడు.
బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఢిల్లీలో గాలిని కొనే పరిస్థితి వచ్చింది.ముందు ముందు బ్రహ్మంగారు చెప్పిన ఇంకా పలు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ జనాలు భయపడుతున్నారు.
ఢిల్లీలో పరిస్థితి చేయి దాటి పోవడంతో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.అందుకే అక్కడ గాలిని కొంటున్నారు.